ఇక ఏటీఎంల నుంచి ఒకేసారి రూ.10,000 తీసుకోవచ్చు... కానీ...
మనీ కష్టాలు మెల్లమెల్లగా తీరుతున్నాయి. ఇప్పటివరకూ ఏటీఎంలలో రోజుకి రూ. 4,500 మాత్రమే డ్రా చేసుకునే వీలు వుండేది. ఈ పరిమితిని రూ.10,000 పెంచుతూ ఆర్బీఐ నిర్ణయం తీసుకుంది. దీనితో ఒకేసారి ఏటీఎంల నుంచి రూ.10 వేలు డ్రా చేసుకోవచ్చు.

కానీ వారానికి రూ.24,000 మాత్రమే డ్రా చేసుకోవాలన్న నిబంధనను అలాగే వుంచుతున్నట్లు తెలిపింది. ఇకపోతే కరెంట్ ఖాతాదారులు తమ ఖాతాల నుంచి ఒకేసారి రూ.1 లక్ష విత్ డ్రా చేసుకునేందుకు అనుమతినిచ్చింది.