Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం - 75 మందికి పాజిటివ్

తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా కలకలం - 75 మందికి పాజిటివ్
, ఆదివారం, 23 జనవరి 2022 (10:52 IST)
చిత్తూరు జిల్లాలోని తిరుపతి ఐఐటీ క్యాంపస్‌లో కరోనా వైరస్ కలకలం చెలరేగింది. తిరుపతి పట్టణానికి సమీపంలోని ఏర్పేడుకు దగ్గరలో ఈ ఐఐటీ క్యాంపస్ ఉంది. అయితే, ఇక్కడ మొత్తం 75 మందికి ఈ వైరస్ సోకింది. ఈ క్యాంపస్‌లో 214 మంది విద్యార్థులు ఉన్నారు. వీరందరికీ జరిపిన కరోనా నిర్ధారణ పరీక్షల్లో 45 మంది విద్యార్థులకు 30 మందికి సిబ్బందికి ఈ వైరస్ సోకింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. 
 
ఐఐటీ క్యాంపస్‌లో ఒక్కసారిగా కరోనా కలకలం చెలరేగడంతో విద్యార్థుల వసతి గృహాన్నే కోవిడ్ కేంద్రంగా మార్చివేశారు. వీరందరినీ అక్కడే ఐసోలేషన్‌లో ఉంచి వైద్యం చేస్తున్నారు. నిజానికి ఈ నెల మొదటి వారంలో దాదాపు 600 మంది తమతమ సొంతూర్లకు వెళ్లిపోయారు. 
 
ప్రస్తుతం బీటెక్, ఎంటెక్, పీహెచ్‌డీ విద్యార్థులు మాత్రమే ఉన్నారు. అదేసమయంలో కోవిడ్ వ్యాప్తి చెందకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకున్నారు. కాగా, ఈ చిత్తూరు జిల్లాలో కరోనా వ్యాప్తి అధికంగా ఉన్న విషయం తెల్సిందే. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో ఒక్క చిత్తూరు జిల్లాలోనే అత్యధికంగా కరోనా పాజిటివ్ కేసుల నమోదవుతున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒమిక్రాన్ వైరస్ దెబ్బకు పెళ్లిని రద్దు చేసుకున్న దేశ ప్రధాని