నోట్ల కష్టాలు : ఏటీఎంల ముందు నిల్చొని ఇప్పటివరకు 70 మంది మృతి
దేశంలో ఏర్పడిన నోట్లు, చిల్లర కష్టాలకు ఇప్పటివరకు మొత్తం 70 మంది వరకు మృత్యువాతపడ్డారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశ వ్య
దేశంలో ఏర్పడిన నోట్లు, చిల్లర కష్టాలకు ఇప్పటివరకు మొత్తం 70 మంది వరకు మృత్యువాతపడ్డారు. పెద్ద విలువ కలిగిన కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రధానమంత్ర నరేంద్ర మోడీ ప్రకటించారు. ఈ నిర్ణయంతో దేశ వ్యాప్తంగా కరెన్సీ కష్టాలు మొదలయ్యాయి. బ్యాంకులు, ఏటీఎంల ముందు క్యూలో నిలబడి ఇప్పటివరకు 70 మంది మృతి చెందారు.
ఇదే అంశంపై ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి మాట్లాడుతూ మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని డిమాండ్ చేసారు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని.. ప్రజలకి అందుబాటులోకి తీసుకొచ్చిన రెండు వేల రూపాయల నోటు సామాన్యులకు ఉపయోగపడడం లేదని మండి పడ్డారు. రెండు వేల రూపాయల నోటు దాచుకోవడానికే పనికొస్తోందని.. చిల్లర దొరక్క సామాన్యులు కష్టాలు ఎదుర్కొంటున్నారని విమర్శలు గుప్పించారు.
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కూడా పెద్ద నోట్లను రద్దు చేసిందని.. ప్రజలకు ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవడంతో అప్పట్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొలేదని చెప్పారు. 14 లక్షల కోట్ల రూపాయల పెద్దనోట్లు చేసిన అనంతరం కొత్తగా ఎన్నినోట్లు విడుదల చేశారని రఘువీరారెడ్డి ప్రశ్నించారు. కేంద్ర తీసుకున్న నిర్ణయంతో వారి లక్ష్యం నెరవేరిందా? అని ప్రశ్నించారు. కొత్తగా విడుదల చేస్తోన్న నోట్లకు నకిలీ నోట్లు ముద్రించలేరని గ్యారెంటీ ఇవ్వగలరా? అని ప్రశ్నించారు.