Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో అర్చకులకు 25 శాతం వేతనం పెంపు

Advertiesment
priests
ఏపీలో దేవాదాయ శాఖ పరిధిలోని ఆలయాల అర్చకులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. అర్చకులకు 25 శాతం జీతం పెంచుతూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. దేవాదాయశాఖపై సీఎం సమగ్ర రీతిలో సమీక్ష నిర్వహించారు.

ముఖ్యంగా అర్చకుల సమస్యలపై దృష్టి సారించారు. ఈ మేరకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. వంశపారంపర్యంగా అర్చకుల నియామకం చేపడుతున్నట్టు తెలిపారు.
 
ఏపీ సర్కారు గత వేసవిలోనూ అర్చకుల జీతాన్ని పెంచిన సంగతి తెలిసిందే. కేటగిరి-1 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.10 వేల నుంచి రూ.15,625కి పెంచారు.

కేటగిరీ-2 దేవస్థానాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని రూ.5 వేల నుంచి రూ.10 వేలకు పెంచారు. ఇప్పుడు మరోసారి వారి వేతనాన్ని పెంచుతూ రాష్ట్రం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డాక్టర్ సుధాకర్ వ్యవహారంలో ఛార్జిషీట్ వేసేందుకు సీబీఐకి అనుమతి