కృష్ణా జిల్లాలో 25 కంటైన్మెంట్ జోన్‌లు

గురువారం, 21 మే 2020 (06:21 IST)
కృష్ణాజిల్లా వ్యాప్తంగా 25 కంటైన్మెంట్ జోన్లను జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ ప్రకటించారు. విజయవాడ నగరంలో కంటైన్మెంట్ జోన్లుగా చిట్టినగర్, గాంధీనగర్, కొత్తపేట, కృష్ణలంక, మాచవరం, మొగ్రలాజపురం, సత్యనారాయణపురం, సింగ్‌నగర్, విద్యాధరపురం ప్రాంతాలు ఉన్నాయి.

కృష్ణాజిల్లాలో కంటైన్మెంట్ జోన్‌లుగా చోడవరం, గొల్లపూడి, కానూరు, మచిలీపట్నం, నూజివీడు, నున్న, రామవరప్పాడు, సూరంపల్లి, తొర్రగుంటపాలెం, యనమలకుదురు, వైఎస్సార్ కాలనీ, పోరంకి, పోతిరెడ్డిపల్లి, మర్లపాలెం, ఆతుకూరు, ఇబ్రహీంపట్నం ప్రాంతాలు ఉన్నాయని కలెక్టర్ తెలిపారు.

ఈ ప్రాంతాలు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో గురువారం నుంచి షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇచ్చినట్లు కలెక్టర్ తెలిపారు. కోవిడ్-19 నిబంధనలకు అనుగుణంగానే దుకాణాలు తెరవాలని కలెక్టర్ ఇంతియాజ్ స్పష్టం చేశారు.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం 50శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవద్దు: సుప్రీం