Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు కూలీలు మృతి

గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం: ఇద్దరు కూలీలు మృతి
, సోమవారం, 20 డిశెంబరు 2021 (14:59 IST)
ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మహిళా కూలీలు దుర్మరణం చెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం యడ్లపాడు 16వ నెంబర్‌ జాతీయ రహదారిపై చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే, చిలకలూరిపేట పట్టణంలోని మద్దినగర్, వడ్డెర కాలనీలకు చెందిన 14 మంది మహిళా కూలీలు పత్తిపాడు మండలం తుమ్మలపాలెంలో పత్తి తీత పనులకు ఆటోలో ఉదయాన్నే బయలుదేరారు. 
 
ఈ క్రమంలో యడ్లపాడు వద్దకు రాగానే ఆటోను.. వెనుక నుంచి వచ్చిన ఓ గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. దీంతో ఆటో అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది.
 
ఈ ఘటనలో మృతులను షేక్ దరియాబి (55), బేగం (52) గా గుర్తించారు. ఈ ఘటనపై యడ్లపాడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నిక‌లు ముందుకు... జ‌మిలి దిశగా కేంద్రం పావులు!