Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో 18 అవార్డులు

ఏపీ పోలీస్ శాఖకు జాతీయ స్థాయిలో 18 అవార్డులు
, శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:34 IST)
ఏపీ పోలీస్ శాఖ 24 గంట‌ల్లోనే మ‌రోసారి జాతీయ స్థాయి అవార్డుల్లో స‌త్తా చాటింది. గవర్నెన్స్ నేషనల్ పోలీస్ ప్ర‌క‌టించిన 28 జాతీయ అవార్డుల‌కు గాను ఏపీ పోలీస్ శాఖ 18 అవార్డులను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది.

ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ -18, మహారాష్ట్ర-2, మధ్య ప్రదేశ్-2, గుజరాత్-2, బీగార్-1, జార్ఖండ్-1, ఛత్తీస్గఢ్-1 తెలంగాణ -1 అవార్డులు ల‌భించాయి.

18 అవార్డులలో పోలీస్ హెడ్క్వార్టర్స్ 7 కైవసం చేసుకోగా, ప్రకాశం 2, అనంతపురం 2, తూర్పుగోదావరి, విజయవాడ సిటీ,  శ్రీకాకుళం, విజయనగరం, కడప,  గుంటూరు రూరల్, కర్నూల్ జిల్లాలకు ఒక్కొక్క అవార్డు వ‌రించింది.

ఈ ఏడాదిలో మొత్తం  ఈ ఏడాదిలో 103 అవార్డులను దక్కించుకొని దేశంలోనే ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ  అగ్రస్థానంలో నిలిచింది. దిశ అప్లికేషన్, పోలీస్ సేవా అప్లికేషన్, డిజిటల్ హెల్త్ అప్లికేషన్‌ల‌కు  జాతీయ స్థాయిలో గుర్తింపు ల‌భించింది.

దీంతో మరోసారి‌ ఏపీ పోలీస్ శాఖను  ముఖ్యమంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి అభినందించారు. ఏపీ పోలీస్ శాఖ‌కు వ‌రిస్తోన్న  అవార్డులు ఏపీ పోలీస్ పని తీరుకు ప్రామాణికంగా భావిస్తున్న‌ట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

48 గంటల్లో 72 అవార్డులు రావడం సంతోషంగా ఉంద‌న్నారు. దేశంలోనే ఏపీ పోలీస్ మెరుగైన సేవలు అందిస్తోందనడానికి అవార్డులే నిదర్శనం అని పేర్కొన్నారు. 
 
పోలీస్‌ అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వం ​ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తుంది. పోలీస్‌ వారోత్సవాల్లో భాగంగా గురువారం విజయవాడ స్వ‌రాజ్య‌మైదానంలో ఏపీ పోలీస్ బ్యాండ్ కార్యక్రమం ఏర్పాటు చేశారు.

కార్యక్రమానికి ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నీలం సాహ్నీ ముఖ్య అతిథిగా హాజర‌య్యారు. ఈ సంద‌ర్భంగా సీఎస్‌కు డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ స్వాగతం ప‌లికారు. పోలీస్ బ్రాస్ బ్యాండ్ ప్రదర్శన ఆహుతులను అల‌రించింది.  పోలీస్ బ్యాండ్‌లో పైస్ బ్యాండ్ అనేది కొత్త విధాన‌మ‌ని డీజీపీ అన్నారు.

పోలీసులకు రక్షణ మాత్రమే కాకుండా కల్చరల్ అంశాలు కూడా తెలుసున‌ని, ప్ర‌స్తుతం చూపించిన ఏపీ బ్యాండ్‌లో చాలా మార్పు వచ్చిందన్నారు. ఉద్యోగ ధర్మం నిర్వర్తించడంలో త‌మ జీవితాలను అర్పించిన పోలీసులకు ఈ విధంగా నివాళులు అర్పిస్తున్నామ‌న్నారు.

ప్రతీ ఒక్కరూ ఆశించిన అంచనాలను చేరేలా బాధ్యతలను నిర్వహించాలని చెప్పారు. కోవిడ్ లాంటి  విపత్కర పరిస్థితుల్లో  ఏపీ పోలీస్ అద్భుతంగా పనిచేశార‌ని ఆయ‌న కొనియాడారు. బాధ్యతలు నిర్వహించడంలో అసువులు బాసిన వారి కుటుంబాలను కూడా జాగ్రత్తగా చూసుకుంటున్నామ‌ని తెలిపారు.

కార్య‌క్ర‌మంలో జిల్లా క‌లెక్ట‌ర్ ఏ.యండి.ఇంతియాజ్‌, న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ బ‌త్తిన శ్రీనివాసులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గొర్రెకుంట కేసులో పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించిన డీ.జీ.పీ