Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

గొర్రెకుంట కేసులో పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించిన డీ.జీ.పీ

గొర్రెకుంట కేసులో పాల్గొన్న పోలీసు అధికారులను అభినందించిన డీ.జీ.పీ
, శుక్రవారం, 30 అక్టోబరు 2020 (07:29 IST)
తెలంగాణ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన గొర్రెకుంట సంఘటనలో తొమ్మిది మంది హత్యకి కారణమైన నిందితుడు సంజయ్ కుమార్ కు కేవలం 25 రోజుల్లోనే శిక్ష పడేలా కృషిచేసిన పోలీస్ అధికారులను  డీజీపీ మహేందర్ రెడ్డి అభినందించారు.

ఈ కేసు విషయంలో దర్యాప్తు చేసిన ప్రస్తుత పోలీస్ కమీషనర్ ప్రమోద్ కుమార్, డీసీపీ కె. వెంకటలక్ష్మి, ఏసీపీ జీ. శ్యామ్ సుందర్, అడిషనల్ పిపి ఎం. సత్యనారాయణ,  ఇన్స్పెక్టర్ జె. శివరామయ్యలతో సహా  మొత్తం 12 మంది పోలీసు అధికారులను డీజీపీ  ఘనంగా సన్మానించి తగు పురస్కారాలను అందజేశారు. 

ఈ కేసులో కీలక పాత్ర వహించిన  మాజీ పోలీస్ కమిషనర్ వీ. రవీందర్ ను కూడా అభినందించారు.  డిజిపి తో సన్మానం  అందుకున్న వారిలో గీసుకొండ ఎస్.ఐ. లు పీ. నాగరాజు, అబ్దుల్ రహీం, హెడ్ కానిస్టేబుళ్లు జీ. విజేందర్, ఎస్.అశోక్ కుమార్, కానిస్టేబుళ్లు జీ. దామోదర్, డీ. కిషన్, జె. లింగయ్య, హోమ్ గార్డ్ జీ. రాజు లున్నారు. 

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని గొర్రెకుంట శివారులో 9 మంది హత్యకు గురైన సంఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. చేదించిన పోలీసులు సంజయ్ కుమార్ ని నిందితుడిగా గుర్తించి అరెస్టు చేసిన 25 రోజుల్లోనే అన్ని ఆధారాలతో సహా 485 పేజీల చార్జిషీట్లు దాఖలు చేశారు.

100 మంది సాక్షుల నువ్వు విచారించారు. దీనితో తో మొదటి అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి  జయ కుమార్  తన తీర్పులో సంజయ్ కుమార్ కు ఉరిశిక్షను వేస్తూ తీర్పునిచ్చారు.

అతి తక్కువ రికార్డు సమయంలో నిందితుడిపై పకడ్బందీ చార్జిషీటు దాఖలు చేసి శిక్షపడేలా కృషి చేసిన పోలీసు అధికారులు  లను డిజిపి ఎం మహేందర్ రెడ్డి హైదరాబాద్లోని   కార్యలయంలో  ఘనంగా సన్మానించారు.  కేసును ఛేదించిన వరంగల్  పోలీసులు రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచారని  డీజీపీ ప్రశంసించారు

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉల్లి ధరతో పోటీ పడుతున్న బంగాళాదుంప