శానిటైజర్ తాగి ఆత్మహత్యకు పాల్పడిన పదిమందికి కరోనా పాజిటివ్ వున్నట్లు తేలింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా కురిచేడు చోటుచేసుకుంది. ఇక ఈ ఘటనలో డెడ్ బాడీలకు పోస్టుమార్టం కోసం హెల్త్ సెంటర్‌కు తరలించారు. అక్కడ మృతదేహాలకు కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా మృతుల్లో నలుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు ఉన్నట్లు నిర్ధారించారు.
ప్రకాశం జిల్లాలో మద్యం దొరక్కపోవడంతో శానిటైజర్ తాగి 14మంది మృతి చెందారు. కురిచేడులో 10 మంది చనిపోగా.. పామూరులో ముగ్గురు మరణించారు. కాగా, ఈ ఘటనపై ఇటు ప్రభుత్వం, అటు ప్రతిపక్షాలు సీరియస్ అయిన విషయం తెలిసిందే.
కాగా మద్యానికి బానిసైన వ్యక్తులు మద్యనిషేధం, రేట్లు పెరగడం.. దానికి తోడు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి. దీంతో కొందరు స్థానికులు, యాచకులు శానిటైజర్‌ను మద్యంగా భావించి సేవించారు. దీంతో ఈ ఘటన పెద్ద సంచలనమైంది. ఘటనపై సీఎంఓ ఆరా తీసింది. జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.