Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఉత్తమ ఉపాధ్యాయులుగా 13 మంది ఎంపిక

Advertiesment
ఉత్తమ ఉపాధ్యాయులుగా 13 మంది ఎంపిక
, బుధవారం, 4 సెప్టెంబరు 2019 (08:29 IST)
ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలకు సంబంధించి ఉత్తమ ఉపాధ్యాయులను  ప్రభుత్వం ప్రకటించింది. 2019 ఏడాదికి గానూ 13 మందిని ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక చేసినట్టు ప్రభుత్వం తెలిపింది. 
 
 ఉత్తమ ఉపాధ్యాయుల ఎంపిక కోసం ఏర్పాటు చేసిన కమిటీ ఈ మేరకు ప్రక్రియను పూర్తి చేసింది. ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిలో శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ జీవీ జగన్నాథరావు, విజయనగరం జిల్లా డెంకాడ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ఏ గౌరీప్రసాద్‌, విశాఖ జిల్లా ఎల్‌బీ జూనియర్‌ కళాశాల అధ్యాపకురాలు ఈ నిర్మల, తూర్పు గోదావరి జిల్లా వీటీ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు వై ప్రభాకర్‌రావు, పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు ఎంఆర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ వి కేశవప్రసాద్‌, కృష్ణా జిల్లా దుర్గామల్లేశ్వర మహిళా జూనియర్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ ఎస్‌ పద్మజ, గుంటూరు జిల్లా పెనుమాక ప్రభుత్వ జూనియర్‌ కళాశాల అధ్యాపకులు ఆర్‌ వీరభద్రరావు, ప్రకాశం జిల్లా టంగుటూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు కే రాజశేఖర్, నెల్లూరు జిల్లా వెంకటాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు ఎం విజయలక్ష్మి, చిత్తూరు జిల్లా వాయల్పాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఎం.రాధాకృష్ణ,  వైఎస్ఆర్ జిల్లా రాయచోటి ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు టి నర్సింహారెడ్డి, కర్నూలు జిల్లా సెయింట్ జోసఫ్ జూనియర్ కళాశాల అధ్యాపకురాలు బి వెంకటలక్ష్మి, అనంతపురం జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ వై ప్రశాంతి ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మల్కాజిగిరిలో ప్రేమించి ప్రెగ్నెంట్ చేసిన లవ్ జిహాదీ....