Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రాజధానిలో 11వరోజు రైతుల దీక్ష.. దేవినేని సంఘీభావం

రాజధానిలో 11వరోజు రైతుల దీక్ష.. దేవినేని సంఘీభావం
, శనివారం, 28 డిశెంబరు 2019 (18:03 IST)
రాజధాని గ్రామాల్లో జరుగుతున్న రైతుల ఆందోళనలకు మద్దతుగా శ్రీ దేవినేని ఉమామహేశ్వరరావు తుళ్లూరు గ్రామంలోని రైతుల దీక్షా శిబిరాన్ని ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు, మాజీ ఎమ్మెల్యేలు బోడె ప్రసాద్,  శ్రావణ్ లతో కలిసి సందర్శించి వారికి సంఘీభావం తెలియజేశారు.
 
ఈ సందర్భంగా దేవినేని మాట్లాడుతూ మీ త్యాగంతో మీరిచ్చిన భూములలో కట్టిన సచివాలయానికి ముఖ్యమంత్రి జగన్ అసాధారణ పోలీసు భద్రత మధ్య ముళ్ళ కంచెలు వేసుకొని డమ్మీ కాన్వాయ్ ఉపయోగించి రావడం సిగ్గుచేటని దేవినేని విమర్శించారు.
 
రాజధాని కోసం 11రోజులుగా మీరు చేస్తున్న పోరాటం దేశం మొత్తం చూస్తోందని రాష్ట్రంలో ప్రతి ప్రాంతాన్ని కదిలించిందని అన్నారు.
 
మీకు మద్దతుగా పోరాటం చేస్తున్నందుకు అరెస్టులు చేసి ఇప్పటికే నాపై నాలుగు కేసులు నమోదు చేశారని మీ కేసులకు అరెస్టులకు భయపడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
 
ఈ నెల 3వ తేదీన బీసీజి కమిటీ రిపోర్టు  వస్తుందని 4వ తేదీ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకొని 18వ తేదీన మీరిచ్చిన భూములలో కట్టిన శాసనసభలో ఆమోద ముద్ర వేయించుకోవాలని చూస్తున్నారని దేవినేని అన్నారు.
 
రాజధాని నిలుపుకోవాలని మీరు చేస్తున్న పోరాటాల ముందు, మీ సంకల్ప బలం ముందు ఏ ముఠాల  లాబీయింగ్ లు పనిచేయవని రాజధాని తరలించే శక్తి ఎవరికీ లేదని అమరావతి రాజధానిగా కొనసాగుతుందని దేవినేని పునరుద్ఘాటించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విశాఖలో జగన్‌కు ఘనస్వాగతం