Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జగన్ అనే బచ్చా నా జోలికి వచ్చాడు... చూపిస్తా... వదిలిపెట్టేది లేదు... : చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Advertiesment
chandrababu

ఠాగూర్

, శనివారం, 6 ఏప్రియల్ 2024 (11:03 IST)
సార్వత్రిక ఎన్నిక తర్వాత టీడీపీ జనసేన బీజేపీ కూటమి అధికారంలోకి రావడం తథ్యమని, తాను ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మరుసటిరోజు నుంచే తానేంటో, తన పవరేంటో వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డికి చూపిస్తానని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెచ్చరించారు. తన ఎన్నికల ప్రచారంలో భాగంగా, వెస్ట్ గోదావరి జిల్లా నరసాపురంలో జరిగిన ప్రజాగళం సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఏపీ బాగుపడాలంటే ఎన్డీయే కూటమి అధికారంలోకి రావాలని, రాష్ట్రాన్ని బాగు చేసే శక్తి ఈ జలగ జగన్ మోహన్ రెడ్డికి లేదని విమర్శించారు. ఈ 40 ఏళ్ల కెరీర్‌లో నాలాంటి వాడి జోలికి ఎవడూ రాలేదు... ఈ బచ్చా నా జోలికి వచ్చాడు... చూపిస్తా... వదిలిపెట్టేది లేదు... చరిత్రలో ఆయన స్థానం ఏంటో చూపిస్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు.
 
ఈ అబద్దాలకోరు జగన్‌ను చూస్తే సినిమా నటుడు నాగభూషణం గుర్తొస్తాడు. ఏపీలో రూ.13 లక్షల కోట్ల అప్పులు తెచ్చారు... మన నెత్తిన అప్పుల కుంపటి ఉంది. నిన్ననే రాష్ట్రంలో ఖజానా ఖాళీ అయిపోయింది... ఇవాళ ఐదో తారీఖు... ఉద్యోగులకు జీతాలు వచ్చాయా? రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్లు వచ్చాయా? నిన్న కూడా వృద్ధులకు, వితంతువులకు పెన్షన్లు ఇవ్వలేక ద్రామాలు ఆడి, శవ రాజకీయాలు చేసిన నీచుడు ఈ జగన్ మోహన్ రెడ్డి అంటూ ధ్వజమెత్తారు. 
 
శవ రాజకీయం అనేది వైకాపా డీఎన్ఏలోనే ఉంది. తండ్రి చనిపోతే, తండ్రి లేని బిడ్డను అంటూ సానుభూతి పొందాడు. బాబాయ్‌ని ఈయనే చంపేసి, మా తండ్రి పోయాడు, బాబాయ్ లేడు... నాకే ఓటేయండి అని అడిగే పరిస్థితికి వచ్చాడు. ఈయనను చూస్తే నాకు పాత సినిమాల్లో విలన్ నాగభూషణం గుర్తుకు వస్తాడు. వీళ్లే చంపి, వీళ్లే దండేసి, ఆ కేసును ఎదుటివాళ్లపై వేసే నీచ, నికృష్టులు వీరని వ్యాఖ్యానించారు. 
 
రాష్ట్రంలో రైతులు దీనావస్థలో ఉన్నారు, రోజుకు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. దేశంలోని మిగతా చోట్ల అప్పుల బాధ తక్కువగా ఉంది, కానీ ఏపీలో రైతుల్లో 93 శాతం మంది అప్పుల్లో ఉన్నారు. వైసీపీ ప్రభుత్వం రైతులను దగా చేసింది. 2014లో రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. రైతు రథం కింద ట్రాక్టర్లు ఇచ్చాం, భూసార పరీక్షలు చేసి పోషకాలు అందించాం. కోస్తాలో ఆక్వా కల్చర్ అభివృద్ధి చేశాం. రాయలసీమలో పెద్ద ఎత్తున హార్టీకల్చర్ ను ప్రోత్సహించాం, తద్వారా వ్యవసాయాన్ని లాభసాటి చేశాంమన్నారు. 
 
గత ఎన్నికల ముందు రైతులకు రూ.12,500 ఇస్తామని చెప్పాడు... కానీ ఇచ్చింది రూ.7,500. కేంద్రం రూ.6 వేలు ఇస్తే, ఈ పెద్ద మనిషి మీకు ఇచ్చింది ముష్టి రూ.7,500. 2014-19 మధ్య ఏపీ ఆక్వాను దేశంలోనే నెంబర్ వన్ చేశాం. ఇవాళ అన్ని ధరలు పెరిగిపోయాయి. ఫీడ్ ధర పెరిగింది, మందుల ధర పెరిగింది, కరెంటు బిల్లులు, ఏఎంసీ సెస్, నీటి ధర, ట్రాన్స్ ఫార్మర్ రేట్లు పెంచారు... రూ.1.50కే కరెంటు ఇస్తామని చెప్పి, ఇప్పుడు జోన్, నాన్ జోన్ విధానం తెచ్చాదా, లేదా? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు వల్లే ప్రాణాలతో జీవించివున్నా : రఘురామకృష్ణంరాజు