Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కొండెవరంలో రోడ్‍షో... సాధారణ వ్యక్తిలా ఆటోలో ప్రయాణించిన పవన్ కళ్యాణ్!!

pawan auto journey

ఠాగూర్

, బుధవారం, 3 ఏప్రియల్ 2024 (13:26 IST)
పిఠాపురం నియోజవర్గంలోని కొండెవరంలో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రోడ్ షో నిర్వహించారు. పలు గ్రామాల్లో ఆయన స్థానకులను కలుసుంటూ, తనకు ఓట్లు వేయాలంటూ విజ్ఞప్తి చేస్తూ ఎన్నికల ప్రచారం చేశారు. అలాగే, కొండెవరం వద్ద ఆయన ఆటోలో ప్రయాణించారు. దాదాపు రెండు కిలోమీటర్ల మేరకు ఆయన ప్రయాణించారు. పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని, అందువల్ల తనకు ఓటేసి గెలిపించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. "నేను మీ పవన్ కళ్యాణ్. పిఠాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తున్నాను. మీరందరూ ఓటేసి నన్ను గెలిపించండి" అని జనసేనాని ఓటర్లను కోరారు. 
 
ఇక ఆటోలో ప్రయాణిస్తున్న సమయంలో అక్కడి రోడ్లపై డ్రైవర్లు ఎదుర్కొంటున్న ఇక్కట్ల విషయంపై ఆటో డ్రైవర్ వద్ద ఆరా తీశారు. ప్రతి ఒక్కరి సమస్యను తెలుసుకుంటానని, మీలో ఒకడిగా ఉంటూ కూటమి ప్రభుత్వం వచ్చాక సమస్యలను పరిష్కరిస్తానని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు. అలాగే, పొన్నాడ గ్రామంలో కూడా ఆయన పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి అక్కడి ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. ఓ సామాన్యుడి ఇంటికి పవన్ వెళ్లగా అక్కడ నెలకొన్న కోలాహలం మాటల్లో వర్ణించలేనివిధంగా ఉంది. పవన్ కళ్యాణ్ అంతటివాడు తమ ఇంటికి రావడంతో, ఆ కుటుంబ సభ్యులంతా ఉబ్బితబ్బిబ్బులైపోయారు. 
 
సాధారణ వ్యక్తిలా వారితో కలిసిపోయారు. కల్మషం లేని నవ్వులు పూయిస్తూ, వారిని ఆప్యాయంగా పలుకరించారు. మంచంపై కూర్చున్న పవన్ కల్యాణ్, ఆ ఇంటివారితో మాట్లాడారు. వారు కూడా పవన్‌ను తమ సొంత మనిషిలా భావించి కష్టనష్టాలు చెప్పుకున్నారు. ఇదిలావుంటే, పవన్‌ను చూసేందుకు వచ్చిన వారితో అక్కడ సందడి మిన్నంటింది. అరుపులు, కేకలు, నినాదాలతో హోరెత్తిపోయింది. దీనికి సంబంధించిన వీడియోలను జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని విడుదల చేసింది. 
 
గత ఎన్నికల్లో గాజువాక, భీమవరం అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఓడిపోయిన పవన్ కల్యాణ్... ఈసారి పిఠాపురం నుంచి చావోరేవో తేల్చుకోవాలని నిశ్చయించుకున్నారు. కూటమి పొత్తులో భాగంగా పవన్ కల్యాణ్ తాను పోటీ చేసేందుకు పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు. గత కొన్నిరోజులుగా ఆయన పిఠాపురంలోనే మకాం వేసి పరిస్థితులను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, పిఠాపురంలో పవన్‌కు పోటీగా వైసీపీ ఎంపీ వంగా గీత బరిలో ఉన్నారు. వంగా గీత కూడా ఎక్కడా తగ్గకుండా ప్రచారంలో ముందుకు పోతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తీవ్ర జ్వరంతో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ : తెనాలి వారాహి యాత్ర రద్దు!