Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు -లోక్ సత్తా నారాయణ

Advertiesment
Jayaprakash

సెల్వి

, బుధవారం, 20 మార్చి 2024 (22:37 IST)
Jayaprakash
ఏపీ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇస్తున్నట్టు లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ ప్రకటించారు. ఏపీలో రాజకీయ పరిస్థితులు ఇంతలా దిగజారడం బాధాకరమని అన్నారు. ఏపీ ఎన్నికల్లో తాము ఎన్డీయే కూటమివైపేనని అన్నారు. 
 
రాష్ట్రంలో కులాల మధ్య పోరాటం జరుగుతోందని... రెడ్డి సామాజిక వర్గం వైసీపీ వైపు ఉంటే... కమ్మ, కాపులు ప్రతిపక్ష పార్టీల వైపు ఉన్నారని జేపీ విశ్లేషించారు. 
 
సంక్షేమమే పాలన అనుకుని, ఇష్టం వచ్చినట్టు అప్పులు చేస్తే రాష్ట్రం దివాలా తీస్తుందని హెచ్చరించారు. అభివృద్ధి చేస్తేనే పాలన అని స్పష్టం చేశారు. ఏపీ కంటే ఒడిశాలో నయమని, ఒడిశాలో రూ.26 వేల కోట్ల ఆదాయం ఉందని, ఎలాంటి ఆర్భాటాలకు పోకుండా అవసరం అనుకుంటేనే అప్పులు చేస్తారని జయప్రకాశ్ నారాయణ వెల్లడించారు. 
 
మరోవైపు ప్రగతిశీల, ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-జనసేన-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలన్న జయప్రకాశ్ నారాయణ గారి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. 
 
అలాగే లోక్ సత్తా నిర్ణయంపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. అన్ని అంశాలపై సమగ్ర అవగాహన కలిగిన జయప్రకాశ్ నారాయణ వంటి మేధావి ఏపీ ఎన్నికల్లో కూటమికి మద్దతు పలకడం హర్షణీయం అని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బరేలికి చెందిన స్మగ్లర్ల అరెస్ట్.. రూ.31లక్షల స్మాక్ స్వాధీనం