Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బాబుకు ఏమైంది.. ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు మాట్లాడుతున్నారంటే..?

బాబుకు ఏమైంది.. ఒక్కోసారి ఒక్కోలా ఎందుకు మాట్లాడుతున్నారంటే..?
, గురువారం, 2 మే 2019 (19:57 IST)
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడుకు ఏమైంది. రెండురోజులకు ఒకసారి ఎందుకలా మాట్లాడుతున్నారు. ఇదే ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారుతోంది. గత నెల 11వ తేదీన ప్రధాన సార్వత్రిక ఎన్నికల మొదటి దశ పోలింగ్ ముగిసిన తరువాత చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్ళడం, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవడం ఇవిఎంలపై అనుమానం వ్యక్తం చేయడం.. వివిప్యాట్‌లలోని స్లిప్‌లను లెక్కించాలని కోరడం.. ఇలా ఒక్కొక్కటి మాట్లాడుతూ వచ్చారు.
 
ఎన్నికల తరువాత జగన్ సైలెంట్‌గా ఉండడం అనుమానానికి తావిస్తోందని, ఇవిఎంలను ట్యాంపరింగ్ చేసి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తం చేశారు చంద్రబాబు. దీంతో రాష్ట్రంలో తీవ్ర చర్చకు దారితీసింది. అటు జగన్, ఇటు విజయసాయిరెడ్డి అందరిపైనా చంద్రబాబు తీవ్రవ్యాఖ్యలు చేశారు. దీంతో సొంత పార్టీ నేతల్లో ఆలోచన మొదలైంది. నిజంగా ట్యాంపరింగ్ జరిగితే టిడిపి గెలుస్తుందా లేదా అన్న అనుమానం అందరిలోను కలిగిందంటున్నారు విశ్లేషకులు.
 
ఈ చర్చ ఇలా జరుగుతుండగా తాజాగా చంద్రబాబు టిడిపి శ్రేణులను ఉత్తేజపరిచేలా మరికొన్ని వ్యాఖ్యలు చేశారు. తమ్ముళ్లూ భయపడవద్దండి. గెలిచేది మనమే. అధికారం మనదే అంటూ చంద్రబాబు మంచి జోష్‌తో అమరావతిలో చెప్పిన మాటలు పార్టీ నేతల్లో అయోమయానికి గురిచేస్తున్నాయి. ఒకసారి ఇవిఎంలు ట్యాంపరింగ్ జరిగిందంటారు. మరోసారి విజయం తమదేనంటారు. చంద్రబాబు ఎందుకిలా మాట్లాడుతున్నారంటూ టిడిపిలోనే తీవ్రస్థాయిలో చర్చ జరుగుతోంది. ఇక ఈవీఎంల గురించి ఏమీ మాట్లాడరేమో?

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పెళ్ళి చేసుకుని నెలరోజులే... రోడ్డు ప్రమాదంలో నవదంపతులు..