ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసే స్థానాలపై ఓ క్లారిటీ వచ్చేసింది. ఏప్రిల్ 11వ తేదీన జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విశాఖ జిల్లా గాజువాక, వెస్ట్ గోదావరి జిల్లాలోని భీమవరం అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేస్తారని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది.
అయితే, ఆయా స్థానాల్లో ఇతర పార్టీల తరపున పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, బలాబలాలపై నెటిజన్లు ఆరాతీయడం మొదలెట్టేశారు. ముఖ్యంగా, పవన్ ప్రత్యర్థులు ఏమాత్రం పోటీ ఇవ్వగలిగిన సత్తా కలిగిన వారో అపుడే బేరీజు వేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ ప్రత్యర్థులు ఎవరో తెలుసుకుందాం.
భీమవరం నియోజకవర్గంలో టీడీపీ తరపున పులవర్తి రామాంజనేయులు, వైకాపా తరపున గ్రంధి శ్రీనివాస్‌లు పోటీ చేస్తున్నారు. అలాగే, టీడీపీ తరపున పల్లా శ్రీనివాసరావు, వైకాపా తరపున టి.నాగరెడ్డి, బీజేపీ తరపున పులుసు జనార్ధన్ రెడ్డిలు పోటీ చేస్తున్నారు.