Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నరాలు తెగే ఉత్కంఠ... 8 గంటలకు ఓట్ల లెక్కింపు

Advertiesment
Lok Sabha Election Result 2019
, గురువారం, 23 మే 2019 (06:12 IST)
దేశ వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు గురువారం ఉదయం 8 గంటలకు ప్రారంభంకానుంది. దేశంలోని 541 (542) లోక్‌సభ స్థానాలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మరికొద్దిసేపట్లో వెల్లడికానున్నాయి. 
 
ముఖ్యంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలు కూడా వెల్లడికానున్నాయి. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలతో పాటు.. 25 లోక్‌సభ సీట్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లూ చేశారు. రాష్ట్రంలో 36 చోట్ల 55 కౌంటింగ్‌ కేంద్రాలు ఏర్పాటు చేసింది. కేంద్రాల్లోని టేబుళ్ల సంఖ్యను ఓట్ల లెక్కింపు 'రౌండ్ల'ను నిర్ణయించారు. ఎన్నికల కౌంటింగ్‌ ప్రక్రియలో 25 వేల మంది సిబ్బంది పాల్గొంటున్నారు. 
 
అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లోని ఓట్ల లెక్కింపు ప్రక్రియను వీడియోలో చిత్రీకరించాలని ఈసీ ఆదేశించింది. మొబైల్‌ ఫోన్లతో సహా ఎలాంటి ఎలకా్ట్రనిక్‌ వస్తువులను లెక్కింపు కేంద్రాల్లోకి అనుమతి లేదు. కౌంటింగ్‌ కేంద్రంలో ఎన్నికల పరిశీలకుడి వద్ద మాత్రమే సెల్‌ఫోన్‌ ఉంటుంది. ప్రతి కౌంటింగ్‌ టేబుల్‌ వద్ద లెక్కింపును గజిటెడ్‌ హోదా కలిగిన అధికారి పర్యవేక్షిస్తారు.
 
తొలుత ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్లు, సర్వీస్‌ ఓట్లు లెక్కిస్తారు. గరిష్ఠంగా అరగంటలో ఈ పని పూర్తవుతుంది. ఒకవేళ... పూర్తికాకపోయినప్పటికీ ఉదయం 8.30 గంటల నుంచి ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారు. చివరిలో లాటరీ విధానం ద్వారా ఎంపిక చేసిన ఐదు బూత్‌లకు సంబంధించిన వీవీప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కిస్తారు. కౌంటింగ్‌ సమయంలో ఈవీఎంలు మొరాయిస్తే వాటిని పక్కనపెట్టి బెల్‌ ఇంజనీర్లతో బాగు చేయిస్తారు. చివర్లో మళ్లీ వాటిని లెక్కిస్తారు. ఈవీఎంలు డీకోడ్‌ కాకపోతే.. ఏం చేయాలో సీఈవో.. ఈసీ దృష్టికి తీసుకెళ్లి, వారి మార్గదర్శకాల ప్రకారం నిర్ణయం తీసుకుంటారు.
 
ముఖ్యంగా, ప్రతి నియోజకవర్గం నుంచి ఐదు అసెంబ్లీ, ఐదు ఎంపీ స్థానాలకు సంబంధించిన (మొత్తం 10) ఈవీఎంలకు అనుబంధంగా ఉండే వీవీప్యాట్‌ స్లిప్పులను లెక్కిస్తారు. అంటే... రాష్ట్రవ్యాప్తంగా 1750 వీవీప్యాట్‌లను లెక్కించాల్సి ఉంటుంది. ఇందుకు కనీసం 3 నుంచి 6 గంటల సమయం పడుతుందని ఈసీ చెబుతోంది. ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్ల సంఖ్యలో తేడా వస్తే మళ్లీ స్లిప్పులు లెక్కిస్తారు. రీకౌంటింగ్‌లోనూ సరిపోలకపోతే వీవీప్యాట్‌ స్లిప్పులనే పరిగణనలోకి తీసుకుంటారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎన్నికలు 2019: గెలిచేదెవరు? ఓడేదెవరు?