Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఎన్నికలు 2019: గెలిచేదెవరు? ఓడేదెవరు?

Advertiesment
ఎన్నికలు 2019: గెలిచేదెవరు? ఓడేదెవరు?
, బుధవారం, 22 మే 2019 (20:42 IST)
ఏప్రిల్ 11 నుంచి మే 19 వరకు భారతీయులు లోక్‌సభలో 542 మంది సభ్యులను ఎన్నుకునేందుకు ఓట్లేశారు. పార్లమెంటులోని దిగువ సభకు సభ్యులను ఎన్నుకునే ఈ పోలింగ్ ఏడు దశల్లో జరిగింది. భారతదేశంలోని 90 కోట్ల ఓటర్లలో ఈసారి అత్యధికంగా 67 శాతం పౌరులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
ప్రజా తీర్పు ఎటువైపు? భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆధ్వర్యంలోని కూటమి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా లేక భారత జాతీయ కాంగ్రెస్ (ఐఎన్‌సీ) నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీల కూటమి తన ప్రదర్శనను 2014 కంటే మెరుగుపర్చుకుంటుందా మే 23 నాటి కౌంటింగ్‌తో తేలనుంది. ఈనెల 19న పోలింగ్ ప్రక్రియ ముగిసిన తర్వాత కొన్ని మీడియా సంస్థలు తమ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను వెల్లడించాయి.
 
రిపబ్లిక్ సీఓటర్ సర్వేలో ఎన్డీయేకు 287 స్థానాలు వస్తాయని చెప్పగా, టుడేస్ చాణక్య, ఆజ్‌తక్ యాక్సిస్ మై ఇండియా, సీఎన్ఎన్ ఐబీఎన్ ఇఫ్సాస్ సంస్థలు తమ సర్వేలో బీజేపీకి 336 నుంచి 340 స్థానాలు వస్తాయని చెప్పాయి. ఈసారి ఈవీఎంలతో నిక్షిప్తమైన ఓట్లతో పాటు, పాటు వీవీపాట్ స్లిప్పులను కూడా లెక్కిస్తారు. దాంతో, ఫలితాల వెల్లడికి ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంది. చివరి ఫలితం రావడానికి కనీసం అయిదు నుంచి ఆరు గంటలు ఆలస్యం అవుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు.
 
వీవీపాట్ అంటే ఏమిటి? అదెలా పనిచేస్తుంది?
ఎన్నికల సంఘం ఓటింగ్ విషయంలో అనేక సంస్కరణలు, విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూనే ఉంది. బ్యాలెట్ బాక్స్‌ల నుంచి ఈవీఎంల వరకు కొత్త సాంకేతికతను వినియోగిస్తూనే ఉంది. అయితే, ఓటింగ్‌లో మరింత పాదర్శకతకు పేపర్ బ్యాలెట్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని 16 రాజకీయ పార్టీలు గతంలో ఎన్నికల సంఘాన్ని కోరాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం వీవీపాట్‌ను తీసుకొచ్చింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పిగ్ ఫెస్టివల్: పందులను అందంగా అలంకరించి ఆపై వండుకుని తినేస్తారు..