Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న వైకాపా సామాజిక న్యాయభేరీ యాత్ర

ysrcp flag
, శుక్రవారం, 27 మే 2022 (16:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికార వైకాపా మంత్రులు చేపట్టిన సామాజిక న్యాయభేరీ బస్సు యాత్ర ప్రశాంతంగా సాగుతోంది. ఈ చిత్రలో మంత్రులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నుంచి ఈ బస్సు యాత్ర మొదలైంది. 
 
ఇప్పటికే రాష్ట్రంలో చేపట్టిన గడప గడపకు మన ప్రభుత్వం చేపట్టిన యాత్రకు ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకం రావడంతో వైకాపా నేతలు గ్రామాల్లో తిరగలేక తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రజల నుంచి చీవాట్లు తప్పించుకునేందుకు ఇపుడు బస్సు యాత్రను వైకాపా నేతలు చేపట్టారు. 
 
శ్రీకాకుళం నుంచి ఈ యాత్ర ప్రారంభిస్తారు. రాష్ట్ర మంత్రివర్గంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గానికి చెందిన మంత్రులు బస్సుల్లో రాష్ట్రమంతా పర్యటిస్తూ, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి తదితర అంశాలను ప్రచారం చేస్తున్నారు. ఆ దిశగా ఈ బస్సు యాత్రకు రూపకల్పన చేశారు 
 
గురువారం ఉదయం తొలుత మంత్రుల బృందం శ్రీకాకుళంలోని ప్రసిద్ధ దేవాలయం అరసవల్లి ఆదిత్యుడ్ని దర్శించుకున్నారు. అనంతరం ఏడురోడ్ల జంక్షన్‌ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ తర్వాత బస్సులో బయల్దేరి ఇతర జిల్లాలకు యాత్ర ప్రారంభమైంది. మంత్రుల యాత్రను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతను కల్పించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నిశ్చితార్థం అయ్యింది, పెళ్లెప్పుడు అని యువతి అడిగితే కాబోయే భర్త పరార్...