Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అగ్రకులాలపై విద్వేషం.. రెచ్చిపోతున్న 'పాపాల మాధవుడు'!!

Advertiesment
అగ్రకులాలపై విద్వేషం.. రెచ్చిపోతున్న 'పాపాల మాధవుడు'!!
, సోమవారం, 14 డిశెంబరు 2020 (16:51 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనంతపురం జిల్లాలో పాపాల మాధవుడు పుట్టుకొచ్చారని విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఆ పాపాల మాధవుడు ఎవరో కాదు. అధికార వైకాపాకు చెందిన అనంతపురం సిట్టింగ్ ఎంపీ గోరంట్ల మాధవ్. ఆయన పోలీస్ నుంచి ఎంపీ స్థాయికి ఎదిగారు. బీసీ సామాజికవర్గానికి చెందిన మాధవ్‌కు ఇపుడు అగ్రకులాలు అంటే ఏమాత్రం గిట్టడం లేదు. అందుకే అగ్రకులాల మీద విద్వేషం చూపిస్తూ, రెచ్చగొట్టే కామెంట్లు చేస్తున్నారంటూ విపక్ష నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 
 
ఆయన పోలీస్ ఇన్‌స్పెక్టరుగా ఉన్న సమయంలోనే రెడ్డి సామాజిక వర్గానికి చెందిన రాజకీయ నేతలకు బహిరంగ వార్నింగ్ కూడా ఇచ్చారు. అలాంటి వారిలో మాజీ మంత్రి జేసీ దివాకర్ రెడ్డి బ్రదర్స్ ఉన్నారు. ఇపుడు ఎంపీగా మారిన తర్వాత మరింతగా రెచ్చిపోతున్నారు. ఈ మధ్య బాగా రెచ్చిపోతున్నారు. 
 
పరిటాల రవి పేరెత్తి మరీ విమర్శలు చేయడం, వనభోజనాలకు వెళ్లి కులాల పేర్లు ఎత్తి విరుచుకుపడడం లాంటివి చేస్తున్నారు. హిందూపురం ఎంపీగా గెలిచిననాటి నుంచి వివాదాల్లో మునిగి తేలుతూ.. పూటకో పంచ్ కొట్టాలని ప్రయత్నిస్తూ గోరంట్ల రెచ్చిపోతునే ఉన్నారు. 
 
ఈ మధ్య గ్యాప్ ఇచ్చిన మాధవ్ మళ్లీ విజృంభిస్తున్నారు. ఎందుకనేది ఎవరికీ అర్థం కావడంలేదని విపక్ష నేతలు అంటున్నారు. సడన్‌గా పరిటాల రవి మీద ఎందుకు పడ్డారన్నది కూడా జనాలకు తెలియలేదు. పరిటాల రవి ఫ్యాక్షనిస్టు అని అనంతపురంలో నెత్తురు పారించారంటూ విమర్శలు చేశారు. 
 
దీంతో మాధవ్‌కు పరిటాల కుటుంబం కౌంటరిచ్చింది. గోరంట్ల చరిత్ర అందరికీ తెలుసునని, అనవసరంగా రెచ్చగొట్టవద్దని వార్నింగ్ కూడా ఇచ్చారు. కార్తీకమాసం వనభోజనాల్లో భాగంగా కురుబ కులానికి చెందిన వారు ప్రొగ్రాం పెట్టారు. ఆ కులానికి చెందిన మాధవ్ ఆ ప్రొగ్రాంకు హాజరై.. రెడ్లు, కమ్మలు దౌర్జన్యాలు చేస్తే ఊరుకోమని హెచ్చరిక జారీ చేశారు. 
 
అసలు తనపైనే రేప్, మర్డర్ కేసులు పెట్టుకుని ఇతరులపై విమర్శలతో రెచ్చిపోతున్న మాధవ్ చరిత్ర చిన్నదేమికాదు. అనంతపురంలో పెట్టిన కియా పరిశ్రమ మేనేజ్‌మెంట్‌ను కూడా బెదిరించారు. అదేమంటే స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడంలేదనే ఆరోపణలు చేశారు. ఆయన దెబ్బకు కియా మేనేజ్‌మెంట్ సీఎంకు మొరపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది.
 
ఇంతకీ మాధవ్ రెచ్చిపోవడానికి కారణం ఏంటంటే.. స్వయంగా బీసీ అయ్యిండి కూడా ఆ వర్గానికి దూరమయ్యారు. బీసీల్లోనే ఆయనపై వ్యతిరేకత వచ్చింది. మరోవైపు టీడీపీ నాయకత్వంలో అగ్రకులాలు, బీసీలు కలిసే ఉన్నారు. ఇప్పుడు అగ్రకులాల మీద విద్వేషం చూపిస్తూ, రెచ్చగొట్టే కామెంట్లు చేస్తూ బీసీల్లో ఛాంపియన్ కావాలని ప్రయత్నిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం కేసీఆర్‌ను జైలుకు పంపుతామంటున్న బీజేపీ నేత!