Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడటం లేదు... ఒంటిపై చేయి పడితే.. ఆర్ఆర్ఆర్

ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడటం లేదు... ఒంటిపై చేయి పడితే.. ఆర్ఆర్ఆర్
, శుక్రవారం, 18 సెప్టెంబరు 2020 (14:52 IST)
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నరసాపురం రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు మరోమారు వైకాపా నేతలపై మాటల తూటాలు పేల్చారు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని స్పష్టం చేశారు. తన ఒంటిమీద చేయపడితే కాపాడేందుకు హేమాహేమీలు ఉన్నారని హెచ్చరించారు. పైగా, పులివెందుల నడిగడ్డపై పదివేల మందితో బహిరంగ సభ నిర్వహించగలను, అది కరోనా సద్దుమణిగిన తర్వాత చూద్దాం అంటూ వ్యాఖ్యానించారు. 
 
ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో క్రమం తప్పకుండా పాల్గొంటున్న రాజు.. తోలుతీస్తామంటూ వ్యాఖ్యలు చేసిన వైసీపీ ఎంపీలపై తనదైనశైలిలో సెటైర్లు వేశారు. ఆకు రౌడీలు ఏదో చేస్తారని భయపడే స్థాయిలో తాను లేనని.. తన ఒంటిపై చేయి పడితే కాపాడేందుకు హేమాహేమీలున్నారని హెచ్చరించారు. 
 
న్యాయవ్యవస్థలను భ్రష్టుపట్టించడమే లక్ష్యంగా తమ పార్టీ పనిచేస్తోందని వ్యాఖ్యానించారు. తనను అనర్హుడిగా ప్రకటించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. తనను బహిష్కరించే దమ్ములేదన్నారు. అంతేకాకుండా, తోలు తీయడం నా వృత్తి కాదండి. వారు బహుభాషా కోవిదులు. అలా మాట్లాడటం కాస్తో కూస్తో వచ్చినా... నాలో నేను మాట్లాడతాను కానీ.. ప్రజలు అసహ్యించుకునేలా... ఉమ్మేసేలా మాట్లాడటం నాకు చేతకాదు. దానికి నేనేమీ చేయలేను. సంస్కార వంతులు.. సంస్కారాన్ని గౌరవించే వాళ్లు, విజ్ఞులు అయిన వాళ్లు 90 శాతం ఉన్నారు. వాళ్లు నా మాట వినండి. 
 
అలాంటి తోలు తీసే చేష్టలకు, తగిన సమాధానం చెప్పే స్నేహితులు నాకున్నారు. ఎంపీ రాజా భయ్యా.. నాకు మంచి స్నేహితుడు. అసలు పేరు రఘు రాజ్ ప్రతాప్. రాజా భయ్యా మాత్రమే కాదు.. నన్ను కంటికి రెప్పలా కాపాడేవాళ్లు... మిగిలిన రాష్ట్రాల్లో కూడా ఉన్నారు. నా ఒంటిపై చిన్న చేయి పడితే.. దానికి స్పందించి.. నన్ను కాపాడగలిగే వ్యక్తులు, స్నేహితులు, రాయలసీమలో కూడా ఉన్నారు. పులివెందులలో కూడా నా స్నేహితులు ఉన్నారు. పదివేల మందితో పులివెందులలో సభ పెట్టగలను. కరోనా తగ్గిన తర్వాత చూద్దాం. న్యాయస్థానాల్లో న్యాయం జరుగుతుంది' అంటూ వ్యాఖ్యానించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సజీవదహనం చేస్తామంటూ కత్తి కార్తీకకు బెదిరింపులు..