నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి చెందిన వైకాపా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల నుంచి తన ఫోన్‌ను ట్యాప్ చేస్తున్నారంటూ ఆరోపించారు. తన ఫోనుపై నిఘా వర్గాలు గత మూడు నెలలుగా నిఘా పెట్టివున్నాయని తెలిపారు.
ఇదే అంశంపై ఆయన ఆదివారం మాట్లాడుతూ, "ఫేస్ టైమర్, టెలిగ్రామ్, కాల్స్‌ను మీ పెగాసస్ రికార్డు చేయలేదు. అధికార పార్టీ ఎమ్మెల్యేపై ముగ్గురు అధికారులతో నిఘా అవసరమా అని ప్రశ్నించారు. నిఘా కోసం నా నియోజకవర్గంలో ఏకంగా ఒక ఐపీఎస్ అధికారిని కూడా ఏర్పాటు చేసుకోండి. క్రికెట్ బెట్టింగ్ కేసులపుడు కూడా ఒక ఎస్పీ నాపై నిఘా పెట్టారు అని కోటంరెడ్డి ఆరోపించారు.