Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దళిత యువకుడు హత్య కేసు : వైకాపా మాజీ మంత్రి కుమారుడి హస్తం

minister viswaroop

ఠాగూర్

, సోమవారం, 21 అక్టోబరు 2024 (08:59 IST)
గత రెండేళ్ల క్రితం కోనసీమ జిల్లాలో జరిగిన ఓ దళిత యువకుడి దారుణ హత్య కేసులో వైకాపాకు చెందిన మాజీ మంత్రి పినిపె విశ్వనాథ్ కుమారుడు శ్రీకాంత్ హస్తం ఉన్నట్టు తాజాగా వెలుగులోకి వచ్చింది. గత ఐదేళ్లపాటు వైకాపా అధికారంలో ఉండటంతో ఈ కేసులో ఎలాంటి పురోగతి లేదు. పైగా, మాజీ మంత్రి కుమారుడు కావడంతో పోలీసులు సైతం ఈ కేసును మాయం చేశారు. ఇపుడు ఏపీలో అధికార మార్పిడి చోటు చేసుకోవడంతో గత వైకాపా ప్రభుత్వంలోని బాధితులంతా పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో మంచ్రి వాసంశెట్టి సుభాష్ చొరవ చూపించడంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేపట్టారు. కేసులో మరో నిందితుడైన ధర్మేశ్‌ను ఇటీవలే అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. అయితే, ఈ హత్యకు సూత్రధారిగా భావిస్తున్న మాజీ మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్‌తో పాటు మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. 
 
కోనసీమ జిల్లా అయినవిల్లికి చెందిన వాలంటీర్ జనుపల్లి దుర్గాప్రసాద్ గత 2022 జూన్ ఆరో తేదీన అదృశ్యమై కోటిపల్లి వద్ద గోదావరిలో శవమై తేలాడు. కోనసీమ అల్లర్ల సమయంలో ఈ ఘటన జరిగింది. మొదట అదృశ్యం కేసుగా నమోదు చేసిన పోలీసులు.. పోస్టుమార్టం నివేదిక ఆధారంగా హత్య కేసుగా మార్చారు. ఆ తర్వాత వైకాపా ప్రభుత్వంలో విశ్వరూప్ మంత్రిగా ఉండటంతో ఆయన ఒత్తిడి మేరకు ఈ కేసు విచారణను పోలీసులు నిలిపివేశారు. 
 
ఈ నేపథ్యంలో నెల రోజుల క్రితం దుర్గా ప్రసాద్ భార్య శ్రావణ సంధ్య మంత్రి వాసంశెట్టి సుభాష్‌ను కలిసి తన భర్తను చంపిన వాళ్లను శిక్షించి తనకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. అపుడే ఈ అంశాన్ని డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి మంత్రి తీసుకెళ్లారు. డీజీపీ ఆదేశాల మేరకు కొత్తపేట డీఎస్పీ గోవిందరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పోలీస్ బృందం దర్యాప్తు చేపట్టారు. ఉప్పలగుపప్తం మండలానికి చెందిన నిందితుడు, వైకాపా సోషల్ మీడియా కన్వీనర్, మృతుడికి స్నేహితుడైన ధర్మేశ్‌ను పోలీసులు విచారించి, అరెస్టు చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను... ఏపీలో మళ్లీ వర్షాలు