Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అభద్రతా భావంతో వణికిపోతున్న జగన్... ప్రైవేటు సైన్యం నియమించుకున్న మాజీ సీఎం!

jagan security

వరుణ్

, మంగళవారం, 18 జూన్ 2024 (12:23 IST)
మాజీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి అధికారంపోయిన తర్వాత అభద్రతాభావంతో వణికిపోతున్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం తన ఇంటి చుట్టూత 200మందికి పైగా పోలీసులను రేయింబవుళ్లు పహారాగా ఉంచుకున్నారు. ఇపుడు ముగిసిన ఎన్నికల్లో వైకాపా చిత్తుగా ఓడిపోయింది. దీంతో ముఖ్యమంత్రి పదవి ఊడింది. దీనికి తోడు వైకాపా కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం కావడంతో ప్రధాన ప్రతిపక్ష హోదా సైతం పోయింది. ఇపుడు కేవలం ఒక సాధారణ ఎమ్మెల్యే మాత్రమే. దీంతో తాడేపల్లిలోని జగన్ ప్యాలెస్‌ వద్ద ఉన్న పోలీసుల పహారా పూర్తిగా తొలగిపోయింది. దీంతో ఆయనకు భయం పట్టుకుంది. అభద్రతాభావంతో వణికిపోతున్నారు. ఈ సమస్య నుంచి గట్టెక్కెందేందుకు ప్రైవేట్ సైన్యాన్న నియమించుకున్నారు. తాజాగా తాడేపల్లి ప్యాలెస్‌కు భద్రతగా సుమారు 30 మంది ప్రైవేటు గార్డులను ఏర్పాటుచేసుకున్నారు. వీరంతా సఫారీ దుస్తులు ధరించి.. 'డ్యూటీ'లో చేరారు. 
 
సీఎంగా ఉన్నప్పుడు జగన్ పరదాలు, బ్యారికేడ్ల మధ్యనే తిరిగారు. పాతకాలపు తాడేపల్లిలోని మాజీ రాజుల కోటను తలపించేలా ప్యాలెస్‌ను కట్టుకున్నారు. అటు వైపు వెళ్లే దారిని మూసేశారు. నిత్యం సుమారు 200 మంది పోలీసులతో సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు.. ఇంటి వైపు ఎవరూ కన్నెత్తి చూసే అవకాశమే లేకుండా దాదాపు 30 అడుగుల ఎత్తున దుర్భేద్యమైన ఇనుప ప్రహరీని నిర్మించుకున్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు దేశ విదేశాల్లో భద్రత కల్పించేందుకు ప్రత్యేక పోలీసు దళాన్ని ఏర్పాటు చేసుకున్నారు. 
 
తీరా చూస్తే.. జగన్‌ను ప్రజలు గద్దె దించేశారు. ఆయనకు ప్రతిపక్ష నేత హోదా కూడా వచ్చే అవకాశంలేదు. కేవలం ఒక ఎమ్మెల్యేకు ఇచ్చే సెక్యూరిటీకి మాత్రమే ఆయన అర్హుడు. ఆయనకు అదనపు భద్రత కల్పించాలంటే... సంబంధిత కమిటీ సమీక్షించాలి. అయితే... జగన్‌కు భద్రతాపరమైన ముప్పు ఉందని నిర్ధారించాలి. రాష్ట్రంలో ఉగ్రవాదం లేదు. మావోయిస్టు తీవ్రవాదమూ లేదు. మాజీ ముఖ్యమంత్రి అనే హోదాను పక్కనపెడితే... జగన్ ఇప్పుడు సాధారణ ఎమ్మెల్యేనే! అందువల్ల ఆయనకు అసాధారణమైన భద్రత కల్పించే అవకాశం అంతకంటే లేదు. తాడేపల్లి ప్యాలెస్ చుట్టూ మూసివేసిన రహదారులను కొత్త ప్రభుత్వం తెరిపించింది. సామాన్యుల రాకపోకలకు అవకాశం కల్పించింది. ఈ నేపథ్యంలోనే జగన్ ప్రైవేటు సెక్యూరిటీని నియమించుకున్నట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పసుపు బిళ్ళ పెట్టుకుని వెళ్లండి.. టీ ఇచ్చి కుర్చీవేసి పని చేసిపెడతారు.. మంత్రి అచ్చెన్నాయుడు