Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వైకాపాకు తేరుకోలేని షాక్.. మంత్రి గుమ్మనూరు జయరాం రాజీనామా

gummana jayaram

ఠాగూర్

, మంగళవారం, 5 మార్చి 2024 (13:03 IST)
ఏపీలో అధికార వైకాపాకు షాకులపై షాకులు తగలుతున్నాయి. ఆ పార్టీకి చెందిన మరో మంత్రి పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. ఆయన పేరు గుమ్మనూరు జయరాం. తాను వైకాపాను వీడుతున్నట్టు ప్రకటించారు. మంగళవారం విజయవాడలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ మేరకు ఆయన ప్రకటించారు. 
 
వైకాపా ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్యే, మంత్రి పదవులకీ రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం మంగళగిరిలో టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘జయహో బీసీ’ సభలో ఆ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. సీఎం జగన్‌ విధానాలతో విసుగుచెందానని గుమ్మనూరు విమర్శించారు.
 
'కర్నూలు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని జగన్‌ అడిగారు. నాకు అది ఇష్టం లేదు. టీడీపీ తరపున గుంతకల్లు నుంచి పోటీ చేస్తా. తాడేపల్లిలో ఇద్దరు పూజారులు ఉన్నారు. గుడిలో శిల్పం మాదిరిగా జగన్‌ తయారయ్యారు. సజ్జల రామకృష్ణా రెడ్డి, ధనుంజయ రెడ్డి చెప్పిందే ఆయన చేస్తున్నారు' అని ఆరోపించారు. 
 
ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి - జీవిత ఖైదును రద్దు చేసిన బాంబే హైకోర్టు 
 
ఢిల్లీ విశ్వవిద్యాలయ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాకు డిల్లీ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసుల ప్రొఫెసర్ సాయిబాబను అరెస్టు చేసిన విషయం తెల్సిందే. ఢిల్లీలోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం దొరికిందని ఆరోపించారు. ఆయన గడ్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరుపరిచారు. 2017లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది. 
 
అనారోగ్యంతో వీల్ చెయిర్‌కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్‌పూర్ జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించారు. 2022 అక్టోబరు 14 తేదీన సాయిబాబాను హైకోర్టు నిర్దోషిగా ప్రకటించి, సెషన్స్ కోర్టు తీర్పును కొట్టేసింది. అయితే, ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కనబెట్టి... ఈ కేసును మరోమారు లోతుగా విచారించాలని బాంబే హైకోర్టును ఆదేశించింది. దీంతో మళ్లీ విచారించిన బాంబే హైకోర్టు మంగళవారం తీర్పునిస్తూ, సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఎంజీబీఎస్- ఫలక్‌నుమా వరకు.. మెట్రో పనులకు 8న శంకుస్థాపన