Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

మాకు అంబేద్కర్ కంటే డబ్బే ముఖ్యం : వైకాపా నేత జూపూడి ప్రభాకర్ రావు

Advertiesment
jupudi prabhakar rao

వరుణ్

, ఆదివారం, 18 ఫిబ్రవరి 2024 (12:37 IST)
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కంటే మాకు డబ్బే ముఖ్యమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సామాజిక న్యాయ సలహాదారుడు జూపూడి ప్రభాకర్ రావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంబేద్కర్ కంటే మాకు డబ్బే ముఖ్యమని వ్యాఖ్యానించారు. అందుకే.. డాక్టర్ అంబేద్కర్ విదేశీ విద్య పథకం పేరును జగన్ విదేశీ విద్యగా మార్పు చేసిన తమకు ఎలాంటి అభ్యంతరం లేదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. జగన్మోహన్ రెడ్డికేవలం తన పేరు కోసమే అంబేద్కర్ పేను తొలగించారని ఆయన చెప్పారు. 
 
ప్రభుత్వ సలహాదారుడుగా ఉన్న జూపూడి ప్రభాకర్ రావు చేసిన వ్యాఖ్యలపై అంబేద్కర్ వాదులు, ప్రజా సంఘాల నేతలు, రాజకీయ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం జగన్ నిలువెత్తు విగ్రహం పెట్టినంతమాత్రాన ఆయన స్ఫూర్తి వైకాపా నేతలకు అబ్బుతుందా? అని విమర్శలు గుప్పించారు. తాను చేసిన వ్యాఖ్యలను జూపూడి వెనక్కి తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. 
 
దేశంలో పాపులర్ ముఖ్యమంత్రుల జాబితా... ఏపీ  సీఎం జగన్‌కు ఎన్నో స్థానం!! 
 
దేశంలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితా ఒకటి తాజాగా వెల్లడైంది. మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో నిర్వహించిన సర్వేలో అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రులు జాబితాలో ఒరిస్సా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు 52.7 శాతం ఓట్లతో మొదటి స్థానంలో నిలించారు. వివాదరహితుడుగా ఉన్న నవీన్ పట్నాయక్‌కు ప్రజలు బెస్ట్ ముఖ్యమంత్రిగా పట్టంకట్టారు. ఆ తర్వాతి స్థానంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రెండో స్థానంలో నిలించారు. ఈయనకు 51.3 శాతం మంది ప్రజలు రేటింగ్ ఇచ్చారు. 
 
ఆ తర్వాతి స్థానంలో 48.6 శాతం ఓట్లతో అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వాశర్మ మూడో స్థానంలో నిలువగా, నాలుగో స్థానంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పాటిల్ 42.6 శాతం ఓట్లు, త్రిపుర ముఖ్యంమత్రి మాణిక్ సాహుకు 41.4 శాతం ఓట్లు దక్కాయి. ఆయన అత్యంత ప్రజాదారణ కలిగిన ముఖ్యమంత్రుల జాబితాలో ఐదో స్థానంలో నిలించారు. 
 
మాణిక్ సాహా తర్వాతి స్థానంలో 41.1 శాతం ఓట్లతో గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, 40.1 శాతం ఓట్లతో ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామిలు ఈ జాబితాలో ఆరు, ఏడు స్థానాల్లో నిలించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ మాత్రం ఎనిమదో స్థానం దక్కింది. ఈయనకు 36.5 శాతం మాత్రమే రేటింగ్ వచ్చింది. తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు 35.8 శాతం రేటింగ్‌తో తొమ్మిదో స్థానంలో నిలువగా, 32.8 శాతం ఓట్లతో బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పదో స్థానంలో నిలిచారు. ఈ జాబితాలో గత నాలుగున్నరేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి చోటే దక్కలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ కోవర్టు కేశినేని నాని .. పిట్టల దొర ఎవరో తెలిపోద్దిగా.. :: కేశినేని చిన్ని