ప్రకాశం జిల్లాలో ఘోర విషాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలం కోప్పర గ్రామంలో విద్యుత్ షాక్‌తో ముగ్గురు బాలురు మృతి చెందారు. వివరాల్లోకి వెళ్తే.. ఈ ఉదయం వైసీపీ జెండా స్తంభం వద్ద విద్యార్థులు ఆడుకుంటున్నారు.
ఒక్కసారిగా జెండా స్తంభం విద్యుత్ లైన్‌కు తగలడంతో షాక్‌కు గురైన విద్యార్థులు సంఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
మృతులు షేక్ పఠాన్ గౌస్(11), షేక్ హసన్ బుడే(11), పఠాన్ అమర్(11)గా గుర్తించారు. పోలీసులు సంఘటనాస్థలిని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. జెండా స్తంభాలకు పర్మిషన్ లేకపోయినా పార్టీల జెండా స్తంభాలు పెడుతున్నారంటూ ప్రజలు ఆరోపిస్తున్నారు.