Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రామాలయ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తే వాళ్ల తల నరుకుతా: బీజేపీ ఎమ్మెల్యేపై కేసు

అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి వ్యతిరేకత తెలిపే వార తల నరుకుతానని హెచ్చరించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో శ్రీరామ నవమి సందర్భంగా తీ

Advertiesment
ram temple
హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (04:49 IST)
అయోధ్యలో రామాలయాన్ని నిర్మించడానికి వ్యతిరేకత తెలిపే వారి తల నరుకుతానని హెచ్చరించిన తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే టి రాజాసింగ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏప్రిల్ 5న హైదరాబాద్‌లో శ్రీరామ నవమి సందర్భంగా తీసిన ఊరేగింపులో ముస్లిం మతస్తులకు వ్యతిరేకంగా రాజాసింగ్ రెచ్చగొట్టే ప్రకటనలు చేశారని మజ్లీస్ బచావో తెహ్రీజ్ (ఎంబీటీ) ప్రతినిధి అహ్మద్ ఖానా ఆరోపించారు. ఈ సమావేశంలో బీజేపీ ఎమ్మెల్యే పలుమార్లు ముస్లింలకు వ్యతిరేకంగా హెచ్చరికలు చేశారన్నారు. 
 
హైదరాబాద్‌లోని సుల్తాన్ బజార్‌లో ఏప్రిల్ 5న నిర్వహించిన సభలో రాజాసింగ్ చేసిన ప్రకటన తాలూకూ వీడీయోను అహ్మద్ ఖాన్ పోలీసులకు సమర్పించారు.  
 
నేను సవాలు చేస్తున్నా. రామాలయ నిర్మాణాన్ని అడ్డుకునే పులికి ఏ తల్లయినా జన్మనిచ్చిందా అని సవాలు చేస్తున్నా. అలాంటివారికి మరో బాబ్రీమసీదు ఘటనను ఎక్కడో ఒకచోట మళ్లీ ఏర్పాటు చేస్తా అని బీజేపీ ఎమ్మెల్యే హెచ్చరించారు. రామాలయ నిర్మాణం నుంచి మమ్మల్నెవరూ ఆపలేరు. ఆలయ నిర్మాణం జరిగే రోజు ఎంతో దూరం లేదు. అయోధ్య రామాలయ నిర్మాణం ప్రతి హిందువు స్వప్నం అని బిజేపీ ఎమ్మెల్యే ప్రకటించారు. 
 
అయోధ్య రామాలయ నిర్మాణానికి తలపెడితే దేశవ్యాప్తంగా అల్లర్లు సృష్టిస్తామని ఉత్తరప్రదేశ్ నుంచి కొందరు వాట్సాప్ సందేశం పంపారు. మే దీన్ని స్వాగతిస్తున్నాం. పలు సంవత్సరాలుగా మేం దీనికోసమే ఎదురు చూస్తున్నాం. విద్రోహులు ఎవరైనా తల ఎత్తితే వాల్ల తలలు నరికేస్తాం అని రాజాసింగ్ హెచ్చరించారు.
 
గత సంవత్సరం కూడా గోవులను చంపిన వారి తలలు నరుకుతామని రాజాసింగ్ హెచ్చరించిన విషయం తెలిసిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

విమానం ఎక్కాక అదనపు ప్యాసింజర్ వచ్చారు..ఎలా సాధ్యం?