Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విమానం ఎక్కాక అదనపు ప్యాసింజర్ వచ్చారు..ఎలా సాధ్యం?

నవమాసాలు పోసి బిడ్జను కనేటప్పుడు తల్లి పడే బాధలు వర్ణనాతీతం. కానీ భూమికి 42 వేల అడుగుల ఎత్తున విమానంలో ఏ డాక్టరూ లేని చోట, ఆసుపత్రి బెడ్ వంటి సౌకర్యానికి ఎలాంటి అవకాశం లేని చోట ఆ తల్లికి నొప్పులు మొదలైతే ఆ దృశ్యాన్ని ఊహించుకోండి మరి. 28 వారాల గర్భవతి

విమానం ఎక్కాక అదనపు ప్యాసింజర్ వచ్చారు..ఎలా సాధ్యం?
హైదరాబాద్ , సోమవారం, 10 ఏప్రియల్ 2017 (04:06 IST)
నవమాసాలు పోసి బిడ్జను కనేటప్పుడు తల్లి పడే బాధలు వర్ణనాతీతం. కానీ భూమికి 42 వేల అడుగుల ఎత్తున విమానంలో ఏ డాక్టరూ లేని చోట, ఆసుపత్రి బెడ్ వంటి సౌకర్యానికి ఎలాంటి అవకాశం లేని చోట ఆ తల్లికి నొప్పులు మొదలైతే ఆ దృశ్యాన్ని ఊహించుకోండి మరి. 28 వారాల గర్భవతి అయిన నఫి డైబీ అనే యువతికి అదే అనుభవం ఎదురైంది. గయానా రాజధాని కోనాక్రి నుంచి ఇస్తాంబుల్ మార్గంలో బుర్కినా ఫాసో రాజధాని క్వాగడౌగౌకు వెళ్లడానికి విమానంలో ప్రయాణిస్తున్నప్పుడు డైబీ కడుపులోని పాప ప్రపంచంలోకి అడుగుపెట్టడానికి ఇదే సమయం అనుకోవడమే ఆ తల్లికి సమస్యగా మారింది.

 
 
అదృష్టవశాత్తూ ఆమె చుట్టూ హీరోలు ఉన్నారు కాబట్టే ఆ గండం నుంచి ఆమె బయటపడింది. టర్కిష్ ఎయిర్ లైన్స్‌లోని కేబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణీకులు వెంటనే రంగంలోకి దిగి ఆమె క్షేమంగా బిడ్డను కనడంలో సహాయపడ్డారు. తమ విమానంలో జరిగిన ఆ అరుదైన ఘటనకు పరవశించిపోయిన విమాన సిబ్బంది విమాన ప్రయాణీకులు జాబితాలో లేని ఈ అదనపు ప్యాసింజర్‌ని సంతోషంగా ఆహ్వానించారు. తల్లి విమానంలో నిలబడి ఉండగా బిడ్డను కన్నారు. విమానంలోని పలువురు ప్రయాణీకులనుంచి మేం సహాయం అందుకున్నాం అని ఫ్లైట్ అటెండెంట్ బైత్యానా ఇనానిర్ తర్వాత మీడియాతో చెప్పారు. ఆకాశంలో పుట్టిన ఆ పాపకు కడిజు అని పేరెట్టారు. 
 
ఇలాంటి అరుదైన ఘటనలను ఎవరైనా సెలబ్రేట్ చేసుకోకుండా ఉంటారా? అందుకే తమ విమానంలో పుట్టిన ఆ పాపను ఎత్తుకున్న భంగిమలో కేబిన్ క్రూ, కెప్టెన్ కలిసి తీసుకున్న ఫోటోలను టర్కిష్ ఎయిర్ లైన్స్ ట్వీట్ చేసింది. ఆ ఘటనకు వారు పెట్టిన పేరు "విమాన రాజకుమారికి స్వాగతం! మా కేబిన్ సిబ్బందికి అభినందనలు"
 
విమానంలో సుఖప్రసవం జరిగిన తర్వాత తల్లీబిడ్డా ఇద్దరినీ క్వాగడౌగౌ విమానాశ్రయంలో ఆంబులెన్స్‌లో ఉంచి ఆసుపత్రికి తరలించారు. ఇద్దరి ఆరోగ్యం బాగుందని వైద్యులు చెప్పారు.
 
నిజమే కదా.. "విమాన రాజకుమారికి స్వాగతం! మా కేబిన్ సిబ్బందికి అభినందనలు"

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం పళనిస్వామికి పదవీగండం? ఓటర్లకు డబ్బు పంపిణీ టార్గెట్‌లో అడ్డంగా బుక్కయినట్లే!