Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నీవిచ్చే సుఖం సరిపోవడం లేదు.. అత్త, మరదళ్లు కూడా కావాలి.. కామపిశాచ భర్తను కడతేర్చిన భార్య

వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓ కామపిశాచాన్ని భార్య చంపేసింది. పడగ గదిలో తానిచ్చే సుఖం సరిపోవడం లేదని, తన అమ్మతో పాటు.. చెల్లెళ్ళు కూడా పక్కలో పడుకోవాలని వేధించడంతో ఆ మహిళ అపర కాళికామాతలా మారి... కట్టుకు

Advertiesment
నీవిచ్చే సుఖం సరిపోవడం లేదు.. అత్త, మరదళ్లు కూడా కావాలి.. కామపిశాచ భర్తను కడతేర్చిన భార్య
, బుధవారం, 7 సెప్టెంబరు 2016 (06:40 IST)
వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఓ కామపిశాచాన్ని భార్య చంపేసింది. పడగ గదిలో తానిచ్చే సుఖం సరిపోవడం లేదని, తన అమ్మతో పాటు.. చెల్లెళ్ళు కూడా పక్కలో పడుకోవాలని వేధించడంతో ఆ మహిళ అపర కాళికామాతలా మారి... కట్టుకున్న భర్తను గొడ్డలికో నరికి చంపింది. చివరకు భర్త శవాన్ని పూడ్చలేక పోలీసులకు లొంగిపోయింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్‌ జిల్లా భూపాలపల్లిలోని జంగేడుకు చెందిన రేనుకుంట్ల నర్సయ్య, నిర్మల దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు. నర్సయ్య 2012లో అనారోగ్యంతో చనిపోయాడు. నిర్మల తన పెద్దకూతురు అనూషకు పరకాల మండలం వెల్లంపల్లి గ్రామానికి చెందిన పెండెల నాగరాజు(28)తో వివాహం చేసి, అల్లుడిని ఇల్లరికంగా తీసుకొచ్చింది. తన భర్త చేస్తున్న పనిని కూడా అల్లుడికి ఇప్పించి కుటుంబ పెద్ద దిక్కుగా ఉండమని చెప్పింది. కానీ అతడు మద్యానికి బానిసై మరదళ్లతో పాటు అత్తతో అసభ్యంగా ప్రవర్తించసాగాడు. 
 
ఈ పరిస్థితుల్లో గత ఆదివారం తెల్లవారుజామున అత్త నిర్మలపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. ఆమె కేకలు వేయడంతో అనూష నిద్రలేచి వారించేందుకు ప్రయత్నించింది. ఆవేశానికి గురైన నాగరాజు దుర్భాషలాడుతూ గొడ్డలితో చంపుతానని బెదిరించగా అనూష తిరగబడి అదే గొడ్డలితో భర్తపై దాడిచేసి మెడపై నరికింది. దీంతో నాగరాజు అక్కడికక్కడే మృతిచెందాడు. తర్వాత తల్లీకూతుళ్లు ఆ శవాన్ని బాత్రూరూంలో పూడ్చి పెట్టాలని నిర్ణయించారు. కొంతమేర గుంతను కూడా తవ్వారు. అయితే శవాన్ని పూడ్చటం సాధ్యం కాకపోవడంతో మధ్యలోనే వదిలేసి పోలీసులకు లొంగిపోయారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నాగరాజు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమను నిరాకరించిందని.. అసభ్య వీడియోలో మార్ఫింగ్‌.. యువకుడి అరెస్టు