Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కాపుకాసి భర్తను చితక్కొట్టింది.. కారణం ఏంటంటే? ప్రేమించి పెళ్లి చేసుకుని..?

Advertiesment
కాపుకాసి భర్తను చితక్కొట్టింది.. కారణం ఏంటంటే? ప్రేమించి పెళ్లి చేసుకుని..?
, గురువారం, 4 మార్చి 2021 (16:20 IST)
ప్రేమకున్న విలువ ప్రస్తుతం కనుమరుగవుతోంది. ఆధునిక పోకడల కారణంగా ప్రేమ, ఆప్యాయతలు మంటగలిసిపోతున్నాయి. తాజాగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను మోసం చేసి మరో యువతితో కాపురం వెలగబెట్టాడు. 
 
అనుమానం వచ్చి నిలదీసిన భార్యకు సమాధానం చెప్పకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు. ఓ రోజు కాపుకాసి భర్తను... అతినితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న యువతిని ఆమె రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. ఆ తర్వాత ఇద్దరికి బడితపూజ చేసింది.
 
వివరాల్లోకి వెళితే.. కొత్తగూడెం, గాజులరాజాం బస్తీలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న రాజు 12 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయితే కొన్ని నెలలుగా రాజు.. మరో యువతితో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. భర్తపై అనుమానం రావడంతో భార్య నిలదీసింది. 
 
అదేంలేదంటూ తప్పించుకున్నాడు. దీంతో భర్తపై ఆమె నిఘా పెట్టింది. వేరే యువతి ఇంటికి భర్త వెళ్లిన తర్వాత బయట గెడ పెట్టి.. బంధువులకు ఫోన్ చేసింది. వారిముందే భర్తతోపాటు ఆ యువతిని చితకబాదింది. ఈలోగా సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి వారిని స్టేషన్‌కు తరలించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఆమె కూడా న్యాయవాది కావడంతో సాక్ష్యం ఉండకూడదని చంపేశాం...