Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆస్తి కోసం తండ్రిపై పెంపుడు కుక్కను ఉపిగొల్పిన కిరాతక కొడుకు.. ఎక్కడ?

అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కన్నతండ్రిపైకి ఓ కిరాతక కొడుకు పెంపుడు కుక్కలను ఉసిగొల్పాడు. ఆస్తిని తన పేరుకి రాసివ్వలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. తాజాగా వ

ఆస్తి కోసం తండ్రిపై పెంపుడు కుక్కను ఉపిగొల్పిన కిరాతక కొడుకు.. ఎక్కడ?
, శుక్రవారం, 14 సెప్టెంబరు 2018 (14:52 IST)
అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేసిన కన్నతండ్రిపైకి ఓ కిరాతక కొడుకు పెంపుడు కుక్కలను ఉసిగొల్పాడు. ఆస్తిని తన పేరుకి రాసివ్వలేదని ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన వెస్ట్ గోదావరి జిల్లాలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
జిల్లాలోని కొంతేరు పంచాయతీ లేతమామిడితోటకు చెందిన లక్ష్మణదాసు అనే వ్యక్తికి ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. కొన్నేళ్ల క్రితం భార్య చనిపోవడంతో ఆయన ఒంటరిగా జీవిస్తున్నారు. పెద్ద కుమారుడు తులసీరావు ఆర్టీసీలో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తుండగా, రెండో కుమారుడు చిరంజీవి, కోడలు రజనీ లక్ష్మణదాసు ఇంట్లోనే ఉంటున్నారు. 
 
లక్ష్మణదాసుకు ప్రభుత్వం ఇచ్చిన 5 సెంట్లతో పాటు మరో ఐదు సెంట్ల స్థలం ఉంది. ఈ నేపథ్యంలో ఈ స్థలాన్ని తన పేర రాయాలని చిరంజీవి తండ్రిపై ఒత్తిడి చేశాడు. దీంతో ఇద్దరు కొడుకుల పేర్లపై చెరో 5 సెంట్ల భూమిని రాసేందుకు లక్ష్మణదాసు అంగీకరించి, ఆ దిశగా ఆయన పనులు చేపట్టారు. 
 
అయితే, చిరంజీవి మాత్రం ఆస్తి మొత్తంలో ఏడున్నర సెంట్లు తనకు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టాడు. దీనికి ఆయన అంగీకరించకపోవడంతో సూటిపోటి మాటలతో వేధించడం మొదలుపెట్టారు. కన్నబిడ్డే కదా తండ్రి మిన్నకుండిపోయాడు. 
 
తన వేధింపులకు తండ్రిలో చలనం లేకపోవడంతో చివరికి పెంపుడు కుక్కను తండ్రిపై ఉసిగొల్పి వేధించడం ప్రారంభించారు. దీంతో సదరు పెద్దాయన తహసిల్దార్ వి.స్వామినాయుడిని ఆశ్రయించి తన బాధను వెళ్లదీశాడు. తన ప్రాణాలకు ముప్పు ఉందనీ,  రక్షణ కల్పించాలని కోరారు. ఈ మేరకు ఆయన వినపత్రం సమర్పించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తండ్రి వయస్సున్న కామాంధుడు అత్యాచారం... వీడియో తీసి... ఆ తరువాత..?