Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కొత్త అల్లుడికి 465 వంటకాలతో సంక్రాంతి విందు.. (Video)

Advertiesment
disehs food

ఠాగూర్

, బుధవారం, 15 జనవరి 2025 (11:09 IST)
ఈ మధ్యకాలంలో సంక్రాంతి పండుగకు తమ ఇంటికి తొలిసారి వచ్చే కొత్త అల్లుళ్లకు అబ్బుపరిచే వంటకాలతో అత్తారింటివారు అదరగొడుతున్నారు. ఇటీవల తెలంగాణా జిల్లాలో సంక్రాంతి పండుగకు తమ ఇంటికి వచ్చిన అత్తామామలు 130 రకాలైన వంటకాలతో విందుభోజనం వడ్డించి ఆశ్చర్యపరిచారు. ఇపుడు యానాంకు చెందిన అత్తింటివారు తమ అల్లుడుకి ఏకంగా 465 వంటకాలతో భోజనం పెట్టి సరికొత్త చరిత్ర సృష్టించారు. 
 
ఇటీవల కాకినాడకు చెందిన తమ అల్లుడికి తెలంగాణకు చెందిన అత్తమామలు 130 రకాల వంటకాలతో విందు ఏర్పాటు చేసి ఔరా అనిపించారు. ఇప్పుడీ రికార్డు బద్దలమైంది. యానాంకు చెందిన ఓ కుటుంబం తమ ఇంటి కొత్త అల్లుడికి ఏకంగా 465 రకాల వంటకాలతో భోజనం పెట్టి చరిత్ర సృష్టించింది. అసలా వంటకాలన్నీ చూసిన తర్వాత... ఇవన్నీ అతగాడు తినడం జరిగే పనేనా అనిపించకమానదు.
 
యానాంకు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త మాజేటి సత్యభాస్కర్ కుమార్తె హరిణికి, విజయవాడ పారిశ్రామికవేత్త సాకేత్‌తో కొన్ని నెలల క్రితం వివాహమైంది. ఈ సంక్రాంతి పండుగకు తమ ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి సత్యభాస్కర్ కుటుంబం చిరకాలం గుర్తుండిపోయేలా ట్రీట్ ఇచ్చింది. వందల వంటకాలు కళ్లముందు కనిపిస్తుంటే, తినదానికి ఆ కొత్త అల్లుడు కాస్తంత సిగ్గుపడిపోవడం వీడియోలో కనిపించింది.ఆ వంటకాల్లో శాకాహార, మాంసాహార వంటకాలు, స్వీట్ అండ్ హాట్, ఫ్రూట్స్, ఐస్ క్రీములు, కూల్ డ్రింకులు... ఇలా రకరకాల డిషెస్ ఉన్నాయి. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సింగర్‌తో కలిసి యువతిపై హర్యానా బీజేపీ చీఫ్ అత్యాచారం!!