Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఏపీ సీఐడీకి విశాఖ కోర్టులో చుక్కెదురు.. అయన్న రిమాండ్‌కు తిరస్కృతి

ayyanna patrudu
, గురువారం, 3 నవంబరు 2022 (20:02 IST)
టీడీపీ నేత, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడిని, ఆయన ఇద్దరు కుమారులను ఫోర్జరీ కేసులో ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేశారు. వారిని విశాఖ కోర్టులో గురువారం సాయంత్రం హాజరుపరిచారు. అయితే, వారిని రిమాండ్‌కు తరలించేందుకు మేజిస్ట్రేట్ నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. 2 సెంట్ల భూమిని ఫోర్జరీ సంతకాలతో అయ్యన్నపాత్రుడు ఆక్రమించుకున్నారన్న అభియోగాలతో వారిని గురువారం తెల్లవారుజామున ఏపీ సీఐడీ అరెస్టు చేసింది. 
 
వీరిని విశాఖపట్టణం చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచగా, ఈ కేసులో ఐపీసీ 467 సెక్షన్ వర్తించదని మేజిస్ట్రేట్ పేర్కొంటూ, వారిద్దరికి రిమాండ్ విధించేందుకు నిరాకరించారు. పైగా, నిందితులకు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులు ఇవ్వాలని సీఐడీ పోలీసులను ఆదేశించింది. అంతేకాకుండా, ఈ కేసులో అయ్యన్నతో పాటు ఆయన కుమారుడు రాజేష్‌కు కోర్టు బెయిల్ మంజూరుచేసింది. 
 
2 సెంట్ల భూమి ఆక్రమణకు అయ్యన్న, ఆయన ఇద్దరు కుమారులు ఫోర్జరీ పత్రాలను సృష్టించారన్న ఆరోపణల నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున అయ్యన్నతో పాటు రాజేషఅ‌ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారు. వీరిద్దరికీ వైద్య పరీక్షలు పూర్తి చేసిన తర్వాత విశాఖ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, అక్కడ చుక్కెదురైంది. దీంతో నర్సీపట్నంలోని అయ్యన్నపాత్రుడు నివాసం వద్ద పండగ వాతావరణం నెలకొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌పై కాల్పులు_దుండగుడి కాల్చివేత