Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

అత్యాచారం చేశావ్ కదా... 20 యేళ్లు జైల్లోనే ఉండు...

Advertiesment
jail
, బుధవారం, 19 అక్టోబరు 2022 (08:41 IST)
బాలికపై అత్యాచారం కేసులో ముద్దాయిగా తేలిన ఓ కామాంధుడికి 20 యేళ్ల పాటు జైలుశిక్ష విధిస్తూ విజయవాడ కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. ఐదు వేల రూపాయల అపరాధం కూడా విధించింది. అలాగే, బాధితురాలికి రూ.5 లక్షల మేరకు పరిహారం ఇచ్చేలా చూడాలని ఆదేశించింది. ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే,
 
విజయవాడ రూరల్ మండలం వైఎస్ఆర్ కాలనీ జక్కంపూడి గ్రామానికి చెందిన సంగెపు నవీన్ (23) అనే వ్యక్తి గత 2019 సెప్టెంబరు 16వ తేదీన స్థానికంగా ఉండే ఓ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆపై ఈ విషయం ఎవరికీ చెప్పొద్దని బాలికను నయానో భయానో బెదిరించాడు. 
 
అయితే, అత్యాచారం ఇంటికి వచ్చిన ఆ బాలిక నీరసంగా, ముభావంగా ఉండటాన్ని తల్లి గమనించి, ఆరా తీయగా అసలు విషయం చెప్పింది. ఆ తర్వాత బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సమర్పించిన ఆధారాలను పరిశీలించిన విజయవాడలోని ఫోక్సో కోర్టు న్యాయమూర్తి డాక్టర్ రజిని తీర్పును వెలువరించారు. 
 
ముద్దాయికి 20 యేళ్ల జైలుతో పాటు 5 వేల రూపాయల అపరాధం కూడా విధిస్తూ తీర్పునిచ్చారు. అలాగే, బాధిత బాలికకు 4 లక్షల రూపాయల పరిహారం అందేలా చూడాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆదేశించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

గుంటూరులో అందరూ చూస్తుండగానే దారుణం హత్య.. భయభ్రాంతులకు గురైన ప్రజలు