ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్,మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఘన స్వాగతం పలికారు.
ప్రత్యేక దళాలతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకి గౌరవ వందనం సమర్పించారు. గన్నవరం విమానాశ్రయం నుండి వెంకయ్యనాయుడు ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌కి బయలుదేరి వెళ్లారు. నాలుగు రోజులు పాటు జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొననున్నారు.
కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణభారత్ ట్రస్ట్‌లో 30న నిర్వహించే డాక్టర్ ఐ.వి.సుబ్బారావు రైతునేస్తం వార్షిక అవార్డుల కార్యక్రమంలో పాల్గొంటారు. 31న విజయవాడ బందరు రోడ్డులో ఉన్న రామ్మోహన్ గ్రంథాలయంలో జరిగే కార్యక్రమానికి హాజరవుతారు.
నవంబరు 1న చినఆవుటపల్లిలోని డాక్టర్ పిన్నమనేని సిద్థార్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అండ్ రీసెర్చ్ ఫౌండేషన్‌లో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు.
అదే రోజ సాయంత్రం ఐఐపీఏ సర్వసభ్య సమావేశానికి వర్చువల్ పద్ధతిలో హాజరవుతారు. నవంబరు 2న విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటారు.