Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే?

vangaveeti radhd engagement
, సోమవారం, 9 అక్టోబరు 2023 (10:42 IST)
మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహన రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణ పెళ్లి ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 3న నరసాపురంకు చెందిన జక్కం బాబ్జీ కుమార్తె అమ్మనితో రాధ నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 22న పోరంకిలోని మురళీ రిసార్ట్‌లో వంగవీటి రాధాకృష్ణ, పుష్పవల్లి వివాహం 7.59 నిమిషాలకు జరగనుంది. 
 
మరోవైపు వంగవీటి రాధాకృష్ణ పెళ్లి కార్డు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ నిశ్చితార్థం సెప్టెంబర్ 3న జరిగింది. పశ్చిమగోదావరి జిల్లా నరసాపురంలో వంగవీటి మోహన రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ, నర్సాపురం మున్సిపల్ మాజీ చైర్‌పర్సన్ జక్కం అమ్మని బాబ్జీ దంపతుల రెండో కుమార్తె పుష్పవల్లి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. 
 
కొద్ది రోజుల క్రితం వీరిద్దరూ కలిసి వంగవీటి రంగాకు నివాళులర్పించిన వీడియోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. 
 
మరోవైపు వంగవీటి రాధా ఇటీవల జనసేనలో చేరనున్నట్లు ప్రచారం జరిగింది. మరోవైపు గత నెలలో గోదావరి జిల్లాల్లో నిర్వహించిన వారాహి యాత్ర సందర్భంగా నరసాపురంలోని జక్కం బాబ్జీ ఇంట్లో పవన్ కళ్యాణ్ బస చేశారు. 
 
ఈ నేపథ్యంలో రాధా కూడా జనసేనలో చేరతారని ప్రచారం జరిగింది. వంగవీటి రాధాకృష్ణ తొలిసారిగా విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి 2004లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి జగన్మోహన్ రాజుపై ఆయన 26,711 ఓట్లతో విజయం సాధించారు. 2009లో కూడా ఆయన కాంగ్రెస్‌లో కొనసాగితే సులువుగా గెలిచి ఉండేవారు.
 
వైఎస్ రాజశేఖర్ రెడ్డి తమ మాట వినకుండా చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలోకి వెళ్లి ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో కొనసాగుతున్నారు. వంగవీటి రాధా వైసీపీ నేతలతో సన్నిహితంగా ఉండడంతో మళ్లీ వైసీపీలో చేరతారనే ప్రచారం సాగింది. అయితే ఆ అనుమానాలకు చెక్ పడింది. నారా లోకేష్ యువగళం యాత్రలో వంగవీటి రాధా పాల్గొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు : రాహుల్ గాంధీ బస్సు యాత్ర!