Jagan house vastu Changes: ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఉన్నట్టుండి తన ఇంటికి మార్పులు చేశారు. తాడేపల్లి ఇంటికి వాస్తు దోషం ఉందని పండితులు చెప్పినట్టు సమాచారం. ఇటీవలే దక్షిణ దిశలో కంచె తొలగించారు. తాజాగా ఈశాన్యం మార్పులు చేశారు.
కలిసి రాని కాలానికి వాస్తు దోషాలే కారణమని జగన్ భావిస్తూ.. తూర్పు ఈశాన్యం మూసి వుంచడం మంచిదని వాస్తు పండితుల సలహా మేరకు ఆ పని చేశారు. తాజా ఇంటికి తూర్పు- ఈశాన్యం వైపున్న కంచెను తొలగించారు. తూర్పు-ఈశాన్యం మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు చెప్పడంతో ఈ మార్పులు చేస్తున్నారు. ఇంటి లోపల కూడా గతంలో చేసిన మార్పుల్ని తొలగిస్తున్నారు.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఊహించని విధంగా అధికారం కోల్పోవడం, వరుసగా ఎదురౌతున్న ఇబ్బందులు, తిరుపతి లడ్డూ వ్యవహారం, కీలక నేతలు పార్టీ వీడటం వంటివాటికి కారణం జగన్ తాడేపల్లి ఇంటి వాస్తు అని వాస్తు పండితులు స్పష్టం చేశారు.