Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీవీ9 నకిలీ విలేకరి అరెస్ట్; బ్యాగులో గంజాయిని త‌ర‌లిస్తూ...

Advertiesment
టీవీ9 నకిలీ విలేకరి అరెస్ట్; బ్యాగులో గంజాయిని త‌ర‌లిస్తూ...
విజయవాడ , మంగళవారం, 31 ఆగస్టు 2021 (14:39 IST)
తూర్పుగోదావరి జిల్లా శంఖవరం మండలం లో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, దుర్గా ప్రసాద్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట్ అని చెప్పుకొంటూ, ఆ  పేరుతో పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న నకిలీ విలేకరిని అన్నవరం పోలీసులు అరెస్టు చేశారు. 
 
త‌ను టీవీ 9 క్రైమ్ జర్నలిస్ట్ గా చెప్పుకుంటూ, పలువురిని బెదిరించి, దుర్గాప్ర‌సాద్ డబ్బులు వసూలు చేస్తున్నట్టు పోలీసులకు పలు ఫిర్యాదులు కూడా అందాయి. ఈ నకిలీ విలేకరి మండపేట కు చెందిన పెద్దిరెడ్డి దుర్గా ప్రసాద్ గా పోలీసులు గుర్తించారు. అన్నవరం కొండ పై ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్న సమయంలో వారిని కూడా బెదిరించి డబ్బులు వసూలు చేశాడు ఈ నకిలీ విలేకరి. యువకుడు ఫిర్యాదుతో ఈ విలేక‌రి బాగోతం వెలుగులోకి వచ్చింది. 
 
దీనితో అన్న‌వ‌రం పోలీసులు ఇత‌నిపై నిఘా పెట్టారు. ఈసారి త‌ను శంఖవరం మండలంలో ఎస్.వి.వి.ఎస్.డి డిగ్రీ కాలేజీ వద్ద బ్యాగులో గంజాయిని తరలిస్తుండగా, పోలీసులు ప‌ట్టుకున్నారు. వారికి కూడా త‌ను టీవీ 9 క్రైం రిపోర్ట‌ర్ ని అని దుర్గాప్ర‌సాద్ చెప్పిన‌ట్లు తెలుస్తోంది. దీనితో ఈ న‌కిలీ రిపోర్ట‌ర్ ని అరెస్టు చేసి ఊచ‌లు లెక్క‌బెట్టిస్తున్నారు పోలీసులు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిక్ బాక్సింగ్ లో స్వర్ణ పతక విజేత చలాది సతీష్