Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టీటీడీ వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం.. రూ.3,309 కోట్ల అంచనాతో కేటాయింపులు

Advertiesment
టీటీడీ వార్షిక బడ్జెట్‌కు బోర్డు ఆమోదం.. రూ.3,309 కోట్ల అంచనాతో కేటాయింపులు
, శనివారం, 29 ఫిబ్రవరి 2020 (19:51 IST)
2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) బడ్జెట్‌కు బోర్డు ఆమోదం తెలిపింది. రూ.3,309 కోట్ల అంచనాతో రూపొందించిన వార్షిక బడ్జెట్‌కు టీటీడీ పాలకమండలి ఆమోద ముద్ర వేసింది.

అనంతరం బడ్జెట్‌కు సంబంధించిన వివరాలను టీటీడీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. బూందీపోటులో అగ్నిప్రమాదాల నివారణకు. 3.30 కోట్లు, బర్డ్‌ ఆసుపత్రిలో మెరుగైన సౌకర్యాల కల్పనకు రూ. 8.50 కోట్లను కేటాయించినట్లు తెలిపారు. బర్డ్‌ ఆసుపత్రిలో కొత్త ఉద్యోగాల భర్తీకి పాలకమండలి అనుమతి ఇచ్చిందన్నారు.

చెన్నైలో పద్మావతి అమ్మవారి ఆలయ నిర్మాణానికి రూ. 3.92 కోట్లు కేటాయించినట్లు సుబ్బారెడ్డి వెల్లడించారు. టీటీడీలో ప్రత్యేక సైబర్‌ సెక్యూరిటీ విభాగం ఏర్పాటుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.

టీటీడీ పరిధిలోని ఆలయాల్లో భద్రత కోసం 1300 సీసీ కెమెరాల కొనుగోలుకు బోర్డు ఆమోదించినట్లు తెలిపారు. అలిపిరి వద్ద ద్విచక్రవాహనాలకు రుసుం మినహాయింపు, తిరుమలకు వచ్చే అన్ని రకాల వాహనాల టోల్ ధరలపై సమీక్ష నిర్వహించాలని పాలక మండలి నిర్ణయించింది.

జమ్ము, ముంబయి, వారణాసిలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి ఏర్పాట్లు చేసేందుకు కూడా అనుమతిచ్చినట్లు సుబ్బారెడ్డి తెలిపారు.
 
సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలు
✍ భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు  3.30 కోట్లు కేటాయింపు
✍ తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14 కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం
✍ 34 కోట్లు ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి నిర్ణయం
✍ బర్డ్ ఆసుపత్రిలో అభివృద్ది పనులకు 8.5 కోట్లు కేటాయింపు
✍ చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3.9 కోట్లు కేటాయింపు
✍ హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని టిటిడి టెంపుల్ దగ్గర పుష్కరిణి, కళ్యాణమంటపం, వాహనమంటపం నిర్మాణానికి ఆమోదం
✍ షోషియల్ మీడియాలో టిటిడి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేటందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్ క్రైమ్ విబాగం ఏర్పాటుకు నిర్ణయం
✍ అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు, కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు, లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించిన టిటిడి
 
టీటీడీ అన్నదాన ట్రస్ట్ కు యార్లగడ్డ  రూ.10లక్షలు విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానం అన్నదాన ట్రస్ట్ కు గన్నవరం నియోజకవర్గ వైసీపీ ఇన్ ఛార్జ్, కెడిసిసి బ్యాంకు చైర్మన్ యార్లగడ్డ వెంకట్రావ్ రూ.10లక్షలు విరాళం అందచేశారు. సతీసమేతంగా వెంకట్రావ్ శుక్రవారం తిరుపతి నుండి కాలి నడకన తిరుమల చేరుకున్నారు.

శనివారం ఉదయం తిరుమలలో శ్రీవారి ను దర్శించుకున్న వెంకట్రావ్ దంపతులు అన్నదానం ట్రస్ట్ కి  పది లక్షల రూపాయల విరాళం చెక్ ను అన్నమయ్య భవన్లో జరిగిన కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ వై.వి.సుబ్బారెడ్డి గారికి అందజేసారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రేమికుడిని చూసి పెళ్లి పీటలు నుంచి పరుగులు తీసి కౌగిలించుకున్న వధువు, ఎక్కడ?