Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బరితెగించిన తెరాస ఎమ్మెల్యే... టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి

తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బరితెగించిపోతున్నారు. నిన్నటికి మొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రెచ్చిపోయాడు. నిన్న మంత్రి చందూలాల్ కుమారుడు వీరంగం సృష్టించాడు.

Advertiesment
బరితెగించిన తెరాస ఎమ్మెల్యే... టోల్‌ప్లాజా సిబ్బందిపై దాడి
, మంగళవారం, 12 డిశెంబరు 2017 (15:37 IST)
తెలంగాణ రాష్ట్రంలో అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు బరితెగించిపోతున్నారు. నిన్నటికి మొన్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం రెచ్చిపోయాడు. నిన్న మంత్రి చందూలాల్ కుమారుడు వీరంగం సృష్టించాడు. నేడు మహిళా ఎమ్మెల్యే తన పవరేంటో చూపించింది. దీంతో తెలంగాణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. 
 
తాజాగా, కరీంనగర్ జిల్లా చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే బోడిగ శోభ, ఆమె అనుచరగణం రేణిగుంట గ్రామం వద్ద ఉన్న టోల్ ప్లాజా సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. టోల్ ఫీజు చెల్లించకుండా వెళ్లేందుకు ఎమ్మెల్యేతో పాటు ఆమె అనుచరులు ప్రయత్నించారు. 
 
దీంతో టోల్ ప్లాజా సిబ్బంది అడ్డుపడటంతో వారి మధ్య గొడవ జరిగింది. దీంతో సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. జరుగుతున్న తతంగాన్ని చిత్రీకరిస్తున్న కొందరి మొబైల్ ఫోన్లను కూడా లాక్కెళ్లారు. ఈ వ్యవహారం కలకలం రేపింది. 
 
ఈ మధ్యకాలంలో తెరాస ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు దురుసుగా ప్రవర్తిస్తూ ప్రజలను హడలెత్తిస్తున్న విషయం తెల్సిందే. వీరి వ్యవహారశైలిపై ఎలక్ట్రానిక్ మీడియాలో ప్రత్యేక కథనాలు ప్రసారమవుతున్నా తెరాస అధినేత, సీఎం కేసీఆర్ మాత్రం నోరుమెదపక పోవడం గమనార్హం. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్టంట్ చేస్తూ.. 62 అంత‌స్తుల భ‌వ‌నం నుంచి కిందపడి..?