Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భారత రత్న అటల్ బిహారి వాజపేయి ప్రధమ వర్థంతి... నివాళులు

Advertiesment
Tributes
, శుక్రవారం, 16 ఆగస్టు 2019 (16:00 IST)
మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజపేయి ప్రధమ వర్ధంతిని రాజమండ్రి రూరల్ మండలం శాటిలైట్ సిటీ అటల్‌జి విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ పార్లమెంటు సభ్యులు కొత్తపల్లి గీత వాజపేయి గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
 
అనంతరం జిల్లా యువ మోర్చా అధ్యక్షుడు ఆకుల శ్రీధర్ మాట్లాడుతూ... అటల్‌జి దేశానికి చేసిన సేవ ఎనలేనిది అని కొనియాడారు. నేషనల్ హైవే నిర్మాణానికి ఆయన చేసిన కృషి మరువలేనిదని తెలియచేసారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు యానపు యేసు, ప్రధాన కార్యదర్శి కోన సతీష్, రాష్ట్ర మహిళ మోర్చా కార్యదర్శి పన్నాల వెంకటలక్ష్మి, జిల్లా ఓబీసీ అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, మండల మహిళ మోర్చా అధ్యక్షులు ధనాల రామలక్ష్మి, మట్టా నాగబాబు, పడాల హాత్తిరామ్, నాసింశెట్టి శ్రీను, కెర నూకరత్నం, పాలివేల వాణి తదితరులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వరదలు.. 12 ఏళ్ల కుర్రోడు.. ఆంబులెన్స్‌కు అలా దారి చూపాడు..