Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పనిమనిషిలా చేరుతుంది... యజమానులను పెళ్ళిచేసుకుంటుంది.. ఆ తరువాత?

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం చేస్తూ లక్షల రూపాయల నగలు, నగదుతో జల్సా చేసింది. విషయ

Advertiesment
పనిమనిషిలా చేరుతుంది... యజమానులను పెళ్ళిచేసుకుంటుంది.. ఆ తరువాత?
, సోమవారం, 5 ఫిబ్రవరి 2018 (19:50 IST)
ఒకటి కాదు రెండు కాదు ఏకంగా మూడు వివాహాలు చేసుకుందో మహిళ. జల్సాలకు అలవాటుపడి, భర్త తీసుకువచ్చే డబ్బులు చాలకపోవడంతో పెళ్ళిళ్ళు చేసుకోవడం ప్రారంభించింది. అలా మూడు పెళ్ళిళ్ళు చేసుకుని ముగ్గురితో సంసారం చేస్తూ లక్షల రూపాయల నగలు, నగదుతో జల్సా చేసింది. విషయం కాస్తా ఒక వ్యక్తి భార్య ద్వారా మీడియాకు తెలియడంతో పరారీలో ఉందా మహిళ. ఇంతకీ ఎవరా మహిళ?
 
తిరుపతి మంగళంకు చెందిన చంద్రకళకు 2013 సంవత్సరంలో వివాహమైంది. ఈమెకు ఇద్దరు కుమారులు ఉన్నారు. మొదటి భర్త గురుమూర్తి మెకానిక్. ఇతని జీతం ఇంటికి సరిపోకపోవడంతో చంద్రకళ కొన్ని ఇళ్ళల్లో పనులు చేసుకుంటూ ఉండేది. కొన్ని ఇళ్ళలో పనిలో చేరిన చంద్రకళ వాసు, సత్యనారాయణ, రాజు అనే ముగ్గురు ఇంటి యజమానులతో సహజీవనం చేయడం ప్రారంభించింది. అంతేకాదు ముగ్గురిని రహస్యంగా పెళ్ళిళ్ళు చేసేసుకుంది కూడా. 
 
అయితే ఆ తరువాతే అసలు కథ తెలిసొచ్చింది ముగ్గురికి. పెళ్ళిళ్ళు చేసుకుని వారి ఇంట్లో వారి భార్యల దగ్గర ఉండే నగలు, నగదును తీసుకొని జల్సాలకు ఖర్చు పెట్టుకునేది చంద్రకళ. ఇలా మరో వివాహం చేసుకోవడానికి సిద్థమవుతుంటే ఆ వ్యక్తి భార్య నాగమణి మీడియాను ఆశ్రయించింది. తమకు న్యాయం చేయాలంటూ మీడియాను కోరింది. విషయం కాస్త చంద్రకళకు తెలియడంతో ప్రస్తుతం ఆమె పరారీలో ఉంది. పోలీసులు నిందితురాలి కోసం వెతుకుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేంద్రం నుంచి నిధులు రాబట్టేందుకు సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్... ఏంటది?