Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్‌ను ప్రారంభించిన విప్రో

ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో తాజాగా ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ షోను ఏర్పాటు చేసింది. ఇండోర్, ఔట్‌డోర్ లైటింగ్ సౌలభ్యం కోసం ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ (ఐఓఎల్) సొల్యూషన్ పేరుతో స్మార్ట్ అ

ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్‌ను ప్రారంభించిన విప్రో
, శుక్రవారం, 2 ఫిబ్రవరి 2018 (15:16 IST)
ప్రముఖ టెక్ దిగ్గజం విప్రో తాజాగా ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ షోను ఏర్పాటు చేసింది. ఇండోర్, ఔట్‌డోర్ లైటింగ్ సౌలభ్యం కోసం ఈ సౌకర్యాన్ని కల్పించింది. ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ (ఐఓఎల్) సొల్యూషన్ పేరుతో స్మార్ట్ అండ్ కనెక్టెడ్ ఇండోర్ మరియు ఔట్‌డోర్‌ల కోసం లైట్ షో ప్రదర్శనను ఇటీవల ఏర్పాటు చేసింది. 
 
ఇదే అంశంపై విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ విభాగం చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ మకరానంద్ సైనీస్ మాట్లాడుతూ, లైటింగ్ రంగంలో గత 25 యేళ్లుగా సేవలు అందిస్తున్న తాము వినియోగదారుల అభిరుచికి అనుగుణంగా తమ ఆవిష్కరణలు ఉంటున్నాయన్నారు. ఇపుడు తాము ఆవిష్కరించిన ఇంటర్నెట్ ఆఫ్ లైటింగ్ లైంటింగ్ రంగంలో తిపెద్ద మార్పుగా ఆయన అభివర్ణించారు.
 
ఈ సందర్భంగా నగరంలోని ప్రముఖ నక్షత్ర హోటల్‌లో లైటింగ్ షోను విప్రో కంపెనీ ఏర్పాటు చేసింది. ఇందులో సరికొత్త లైటింగ్ ఆవిష్కరణలను ప్రదర్శనకు ఉంచింది. అంతేకాకుండా, ఈ లైటింగ‌తో ఇంటర్నెట్, సీసీటీవీ టెక్నాలజీని అనుసంధానం చేయడం గమనార్హం. గత యేడాది పలు ప్రతిష్టాత్మక అవార్డులను గెలుచుకున్నట్టు తెలిపారు. ముఖ్యంగా, ప్రాడక్ట్ డిజైన్లు, ఆవిష్కరణలు, క్వాలిటీ ఎక్స్‌లెన్స్ తదితర విభాగాల్లో ఈ అవార్డులు ఉన్నట్టు తెలిపారు. 
 
కాగా, విప్రో ఎంటర్‌ప్రైజెస్ సంస్థలో విప్రో కన్జూమర్ కేర్ అండ్ లైటింగ్ గ్రూపు ఓ అనుబంధ విభాగంగా ఉంది. దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఎఫ్ఎంసీజీ రంగంలో ఇది ఒకటన్నారు. విప్రో కేర్ వ్యాపారంలో పర్సనల్ వాష్ ప్రాడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రాడక్ట్స్, బేబీ కేర్ ప్రాడక్ట్స్, వెల్నెస్ ప్రాడక్ట్స్, ఎలక్ట్రికల్ వైర్ డివైసెస్, డొమెస్టిక్ అండ్ కమర్షియల్ లైటింగ్, మాడ్యులర్ ఆఫీసర్ ఫర్నీచర్ వంటి అనేక రకాల వస్తువులను ఉత్పత్తి చేస్తున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చంద్రబాబు "భోజనం ఫోన్‌కాల్‌"పై టీడీపీ నేతల్లో వణుకు