Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 30 April 2025
webdunia

ముగ్గురు యువకులు మృతి.. బర్త్ డే పార్టీకి వెళ్లి తిరిగొస్తుండగా..?

Advertiesment
road accident
, బుధవారం, 29 జూన్ 2022 (18:17 IST)
రాజమండ్రిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులు ప్రాణాలు కోల్పోయారు. స్నేహితుడి పుట్టినరోజు జరుపుకుని తిరిగి ఇంటికి కారులో వెళ్తుండగా.. ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. తూర్పు గోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదం ముగ్గురు యువకులు దుర్మరణం చెందగా మరో ముగ్గురు తీవ్ర గాయాలపాలయ్యారు. 
 
వివరాల్లోకి వెళితే...  తూర్పు గోదావరి జిల్లా దవళేశ్వరంకు చెందిన ఆరుగురు యువకులు మంగళవారం స్నేహితుడి పుట్టినరోజు వేడుక జరుపుకున్నారు. అర్ధరాత్రి వరకు స్నేహితులంతా బర్త్ డే పార్టీలో సరదాగా గడిపారు. అనంతరం అందరూ కలిసి ఓ కారులో విశాఖపట్నం బయలుదేరారు. 
 
అయితే అర్థరాత్రి హైవేపై వాహనాలు తక్కువగా వుండటంతో యువకులు కారును అతివేగంగా నడిపినట్లున్నారు. రాజమండ్రి సమీపంలోని హుకుంపేట వద్ద వీరు ప్రయాణిస్తున్న కారు ఒక్కసారిగా అదుపుతప్పింది. రోడ్డుపక్కకు దూసుకెళ్లిన కారు ఓ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టింది. దీంతో ఇద్దరు యువకులు జయదేవ్ గణేష్, వెంకటేశ్ అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకుడు తీవ్ర గాయాలపాలై  హాస్పిటల్లో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. 
 
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. గాయాలపాలైన యువకులను దగ్గర్లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆ తర్వాత యువకుల మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బీహార్‌లో పిడుగుపాటు.. ఒక్క రోజే 16 మంది మృతి