Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి అత్యాచారం... బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో...

కామాంధులు ఎప్పుడెప్పుడు కాటేయాలా అని చూస్తుంటారు. పొరబాటున ఒంటరిగా అమ్మాయి కనబడితే ఇక అంతేసంగతులు. పదవ తరగతి చదువుతున్న ఓ బాలికను మాయచేసి నమ్మించి అత్యాచారం చేశారు. ఆమె తన ఇంటికి వెళుతున్న సమయంలో ఇద్దరు స్నేహితులు వచ్చి లిఫ్ట్ ఇస్తామని చెప్పి ద్విచక్

Advertiesment
లిఫ్ట్ ఇస్తామని తీసుకెళ్లి అత్యాచారం... బాత్రూంలో స్నానం చేస్తుండగా వీడియో...
, బుధవారం, 1 ఆగస్టు 2018 (17:21 IST)
కామాంధులు ఎప్పుడెప్పుడు కాటేయాలా అని చూస్తుంటారు. పొరబాటున ఒంటరిగా అమ్మాయి కనబడితే ఇక అంతేసంగతులు. పదవ తరగతి చదువుతున్న ఓ బాలికను మాయచేసి నమ్మించి అత్యాచారం చేశారు. ఆమె తన ఇంటికి వెళుతున్న సమయంలో ఇద్దరు స్నేహితులు వచ్చి లిఫ్ట్ ఇస్తామని చెప్పి ద్విచక్ర వాహనంపై ఎక్కించుకెళ్లి రాత్రయ్యేవరకూ ఊరంతా తిప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమెపై అఘాయిత్యం చేశారు.
 
వివరాల్లోకి వెళితే... చింతలపూడిలో ఒక హాస్టల్‌లో పదో తరగతి చదువుతోంది బాలిక. ఆ విద్యార్థిని స్పెషల్‌ క్లాస్‌కు వెళ్తానని చెప్పి తన స్వగ్రామం చింతలపూడి పాత బస్టాండ్‌కు వెళ్లింది. ఆమె అలా నడిచి వెళ్తున్న సమయంలో కిరణ్‌, చిట్టిబాబు ఇద్దరూ ఆమెను చూసి తాము అటే వెళ్తున్నామనీ, ద్విచక్ర వాహనం ఎక్కితే ఊరికి తీసుకెళతామని నమ్మించి ఎక్కించుకున్నారు. ఆమెను తీసుకుని వూరంతా తిప్పి మసకపడిన తర్వాత ఐటీఐ కాలేజీ సమీపంలో ఆమెను నిర్బంధించి ఇద్దరూ ఆమెపై అత్యాచారం చేశారు.
 
జరిగిన విషయాన్ని చెబితే చంపేస్తామని బెదిరించడమే కాకుండా ఆమెను చిట్టిబాబు బావ ఇంట్లో వదిలి వెళ్లారు. ఐతే ఆ బాలిక ఇంట్లో స్నానం చేస్తుండగా చిట్టిబాబు ఆమెను తన సెల్ ఫోనులో వీడియో తీశాడు. ఆమెకు వాటిని చూపించి, తనకు సహకరించకపోతే ఆ వీడియోలను లీక్ చేస్తానని భయపెట్టి మళ్లీ అత్యాచారం చేశాడు. ఇలా ఆమెపై పలుమార్లు అత్యాచారం జరిపారు. మరోవైపు హాస్టలు నుంచి వెళ్లిన ఆ బాలిక ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కేటీఆర్‌ను ఇరికించిన కవిత.. అభివృద్ధిలో పక్షపాతం చూపించవద్దని?