Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వినుకొండ రైతు నరేంద్రను జైలు నుంచి విడుదల చెయ్యాలి...

Advertiesment
telugu desam party national president nara chandra babu naidu
విజ‌య‌వాడ‌ , శనివారం, 15 జనవరి 2022 (15:26 IST)
గుంటూరు జిల్లా, వినుకొండ నియోజకవర్గం, శావల్యాపురం రైతు నరేంద్రను వెంటనే జైలు నుంచి విడుదల చెయ్యాల‌ని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డిమాండు చేశారు. రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం క్షమాపణ చెప్పాల‌న్నారు. తాను చేయని తప్పుకు సంక్రాంతి పండుగ రోజు రైతు నరేంద్ర జైలులో ఉండడానికి కారణమైన వైసీపీ ప్రభుత్వం క్షమాపణ చెప్పాల‌ని చ‌ద్ర‌బాబు డిమాండు చేశారు. 
 
 
పండుగ పూట ఆ అన్నదాత కుటుంబం క్షోభకు కారణమైన ప్రభుత్వాన్ని రైతులోకం క్షమించద‌న్నారు. మద్దతు ధర అడిగిన పాపానికి రైతును జైల్లో పెట్టి జగన్ ప్రభుత్వం రైతు వర్గాన్నే అవమానించింద‌ని చంద్ర‌బాబు విమ‌ర్శించారు. వినుకొండ ఎమ్మెల్యే ఆదేశాలతోనే అక్రమ కేసు పెట్టినట్లు ఇప్పటికే నిర్ధారణ అయ్యింద‌ని, తప్పుడు కేసు పెట్టిన వినుకొండ రూరల్ సీఐ అశోక్ కుమార్ సస్పెండ్ అయ్యార‌ని తెలిపారు. ప్రభుత్వం తన తప్పు తెలుసుకుని వెంటనే రైతు నరేంద్ర ను విడుదల చెయ్యాల‌ని, వేధింపులకు గురిచేసినందుకు నరేంద్ర కుటుంబానికి పరిహారం చెల్లించాల‌ని డిమాండు చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

APలో మళ్లీ భూప్రకంపనలు: రోజు విడిచి రోజు భూమి కంపించడంతో..?