Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

కేంద్ర మంత్రులతో టీడీపీ ఎంపీలు వరుస భేటీలు

Advertiesment
TDP
, గురువారం, 24 సెప్టెంబరు 2020 (19:58 IST)
టీడీపీ ఎంపీలు ఇవాళ డిల్లీలో కేంద్ర మంత్రులతో వరుస భేటీలు నిర్వహిస్తూ బిజీగా గడిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ఉపాధి హామీ పథకాల అమలు, బిల్లులు చెల్లింపు తదితర అంశాలపై వారు కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేశారు. దీనిపై టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ ట్వీట్ చేశారు.
 
కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కలిశామని వెల్లడించారు. 2019 జూన్ 1 వరకు చేసిన ఎంజీఎన్ఆర్జీఈఎస్ పనులను వైసీపీ సర్కారు నిలిపివేసిందని, కానీ ఆ నిధులను 2019 జూన్ 1 తర్వాత చేసిన పనులకు చెల్లిస్తోందని తాము కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. ఈ విధమైన నిధులు మళ్లింపు ఎంజీఎన్ఆర్జీఈఎస్ ప్రమాణాలకు వ్యతిరేకమన్న విషయాన్ని ఆయనకు తెలిపామని పేర్కొన్నారు.
 
గతంలో చేపట్టిన పనులు ఎందుకు నిధులు చెల్లింపులు జరపలేదో విచారణకు ఆదేశించాలని కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్ తోమర్‌ను కోరామని గల్లా జయదేవ్ వెల్లడించారు. అంతేకాకుండా పాలనా పరమైన ఆలస్యం కారణంగా పెండింగ్ చెల్లింపులను 24 శాతం వడ్డీతో కలిసి ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కాగా టీడీపీ ఎంపీలు అంతకుముందు కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరీని కూడా కలిశారు. టీడీపీ ఎంపీల బృందంలో గల్లా జయదేవ్‌తో పాటు కేశినేని నాని, రామ్మోహన్ నాయుడు, కనకమేడల రవీంద్రకుమార్ ఉన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హైదరాబాద్ ఆసుపత్రిలో వైఎస్ భారతి తండ్రి గంగిరెడ్డి, పరామర్శించిన వైఎస్ జగన్