Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సీఎం కళ్లలో ఆనందం చూడటానికే పోలీసుల చర్యలు : దేవినేని ఉమ

Advertiesment
devineni uma
, గురువారం, 19 జనవరి 2023 (19:25 IST)
సీఎం జగన్ కళ్లలో ఆనందం చూడటానికే పోలీసులు టీడీపీ కార్యాలయాన్ని కూల్చడం వంటి పనులు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమ విమర్శించారు. రెవెన్యూ, పంచాయతీరాజ్‌ శాఖలు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డాయన్నారు. 
 
పార్టీ ఆవిర్భావం నుంచి అదే స్థలంలో కార్యాలయం ఉందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఫిర్యాదు ఇవ్వగానే తొలగించేశారన్నారు. ఎన్టీఆర్‌ వర్థంతి కార్యక్రమం జరగకూడదనే ఇదంతా చేశారని దేవినేని ఉమ విమర్శించారు. 
 
మరోనేత అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ, ‘‘పార్టీ కష్టకాలంలో దూరంగా ఉన్నవాళ్లు కూడా బాగుండాలనే కోరుకుంటాం. టీడీపీకి మొదట్నుంచి బడుగులే అండగా ఉన్నారు. టీడీపీ బీసీలకే పెద్ద పీట వేసింది. పార్టీ అధికారంలో ఉన్నా.. లేకున్నా బీసీలు టీడీపీకి అండగానే ఉన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీ.. హార్డ్ వేర్ కంపెనీలే కాదు.. అండర్ వేర్ కంపెనీలు కూడా పోతున్నాయి. జాకీ అండర్ వేర్ కంపెనీని కేటీఆర్ పట్టుకుపోయారు.
 
రాజధాని లేని దిక్కుమాలిన రాష్ట్రంగా ఏపీ మిగిలిపోయింది. భారతీ సిమెంట్స్ ధర మిగిలిన వాటికంటే రూ. 20 ఎక్కువ. సీఎం జగన్ ముద్దుల భార్య కంపెనీ అనేనా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు. త్వరలో టీడీపీ బీసీ నేతల సమావేశం. మూడు ప్రాంతాల్లో బీసీ సదస్సులు పెడతాం. బ్రాందీ షాపులను 25 ఏళ్ల తనఖా పెట్టి.. రూ. 8700 కోట్లు అప్పు తెస్తారా..? బ్రాందీ షాపులను తనఖా పెట్టిన దౌర్బాగ్యుడని తెలియక ప్రజలు ఓటేశారు’’ అని పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మేరీల్యాండ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా హైదరాబాద్ అమ్మాయి.. భగవద్గీతపై..?