అమెరికా రాజధానికి సమీపంలోని మేరీల్యాండ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారతీయ-అమెరికన్ రాజకీయవేత్తగా అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ హౌస్‌కు మాజీ ప్రతినిధి, అరుణ బుధవారం రాష్ట్ర 10వ లెఫ్టినెంట్ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు.
లెఫ్టినెంట్ గవర్నర్ తర్వాత రాష్ట్ర అత్యున్నత అధికారిగా వ్యవహరిస్తారు. గవర్నర్ రాష్ట్రానికి దూరంగా వున్నప్పుడు వారు విధులను నిర్వర్తించలేని సమయంలో గవర్నర్ బాధ్యతను స్వీకరిస్తారు.
ఇక మేరీల్యాండ్‌కు లెఫ్టినెంట్ గవర్నర్‌గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తన ప్రారంభ ప్రసంగంలో, హైదరాబాద్‌లో జన్మించిన అరుణ, తనకు ఏడేళ్ల వయసులో భారతదేశం నుండి యునైటెడ్ స్టేట్స్‌కు వలస వచ్చామని చెప్పారు. ఈ సందర్భంగా తన కుటుంబం గురించి తెలిపారు.
మిల్లర్ భగవద్గీతపై ప్రమాణం చేశారు. రాష్ట్రంలోని భారతీయ అమెరికన్లలో ఆమెకు ఉన్న ప్రజాదరణ కారణంగా మిల్లర్ ను విజయం వరించింది.